మహేశ్ బాబుకు మరో హిట్ పక్కా... ఎందుకంటే...

‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ బాబు (Youtube/credtit)

సంక్రాంతి హీరో మహేశ్ బాబుకు బాగా కలిసొచ్చిన సీజన్. సంక్రాంతి బరిలో పలు సూపర్ హిట్స్ అందుకున్న మహేశ్ బాబు.. మరోసారి పండగ సీజన్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు.

  • Share this:
    సినిమా ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్లకు కేరాఫ్ అడ్రస్. సెంటిమెంట్ వర్కవుటయితే తమ సినిమా హిట్టే అని చాలామంది దర్శకనిర్మాతలు నమ్ముతుంటారు. ఫ్యాన్స్ కూడా ఇదే విషయాన్ని ఫాలో అవుతుంటారు. తాజాగా మహేష్ బాబు నయా మూవీ విషయంలో ఇలాంటి రెండు సెంటిమెంట్లు ఆయన ఫ్యాన్స్‌లో ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటివరకు దర్శకుడిగా వరుస సక్సెస్‌లు చవిచూస్తున్న దర్శకుడు రావిపూడి అనిల్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరూ మూవీలో నటిస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్. ఈ నయా మూవీ ద్వారా చాలాకాలం తరువాత సీనియర్ నటి విజయశాంతి మళ్లీ సినిమాల్లో రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవబోతోంది.

    సంక్రాంతి హీరో మహేశ్ బాబుకు బాగా కలిసొచ్చిన సీజన్. సంక్రాంతి బరిలో పలు సూపర్ హిట్స్ అందుకున్న మహేశ్ బాబు.. మరోసారి పండగ సీజన్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈ సారి మహేష్ బాబుకు డబుల్ సెంటిమెంట్ కలిసొస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 2003లో మహేష్ బాబు హీరోగా వచ్చిన ఒక్కడులో కర్నూలు కొండారెడ్డి బూరుజు సీన్ కనిపిస్తుంది. సంక్రాంతి బరిలో నిలిచిన ఒక్కడు సూపర్ డూపర్ హిట్టయ్యింది. తాజాగా సరిలేరు నీకెవ్వరూ సినిమాలోనూ కర్నూలు కొండారెడ్డి బురుజు సీన్లు ఉండటం... అది కూడా సంక్రాంతి రేసులో నిలవనుండటంతో... మహేష్ బాబుకు సక్సెస్ సెంటిమెంట్ కలిసొస్తుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: