MAHESH BABU SARILERU NEEKEVVARU MOVIE DUBBED IN TAMIL TITLE IVANUKKU SARIYAANA AAL ILLAI RELEASE VERY SOON TA
Mahesh Babu: తమిళంలో విడుదల కానున్న మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’.. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..
తమిళంలో మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ (Twitter/Photo)
Mahesh Babu Sarileru Neekevvaru Tamil Version | సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవక్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టైటిల్‌కు తగ్గట్టుగానే అన్ని ఏరియాల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాను తమిళంలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.
Mahesh Babu Sarileru Neekevvaru Tamil Version | సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవక్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టైటిల్‌కు తగ్గట్టుగానే అన్ని ఏరియాల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రం మిక్స్డ్ తెచ్చుకున్నా.. మహేష్ బాబు తన స్టామినాతో ఈ సినిమాను విజయ తీరాలకు చేర్చాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం అక్కడక్కడా తేలిపోయినా.. మహేష్ బాబు తనదైన నటనతో ఈ సినిమాను నిలబెట్టాడు. ఈ సినిమా మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 143 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్ మార్కెట్లో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా 2 మిలియన్ డాలర్స్‌ను వసూళు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. మరోవైపు ఈ సినిమాతో విజయశాంతి నటిగా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ఈ సినిమాను కన్నడలో డబ్ చేసి రిలీజ్ చేసారు. తాజాగా ఈ సినిమాను తమిళంలో కూడా డబ్ చేసారు.
తమిళంలో మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ (Twitter/Photo)
అంతేకాదు తమిళంలో త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించమే కాదు.. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసారు. తమిళంలో ఈ సినిమాకు ‘ఇవానుక్కు సరియాన ఆల్ ఇల్లై’ ( IVANUKKU SARIYAANA AAL ILLAI ) పేరుతో విడుదల చేస్తున్నారు. అంతేకాదు ఈ గురువారం నుంచి థియేటర్స్ తెరుచుకోవడానికి కేంద్రం పర్మిషన్ ఇచ్చినా.. సరైనా సినిమాలు లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ కావడం లేదు. మహారాష్ట్ర సహా వివిధ రాష్ట్రాల్లో కొన్ని మల్టీప్లెక్సులు, థియేటర్స్ యాజమాన్యాలు పాత సినిమాలను విడుదల మళ్లీ రీ రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. మరి తమిళనాడులో సరిలేరు నీకెవ్వరు సినిమాఎపుడు విడుదల చేస్తారనేది చూడాలి. మరి తెలుగులో ఇరగదీసినట్టే ఈ సినిమా తమిళంలో కూడా ఇరగదీస్తుందా లేదా అనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.