సరిలేరు నీకెవ్వరు సెన్సార్ రివ్యూ.. అభిమానులకు ఆ ఒక్కటే భయం..

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా సెన్సార్ పూర్తైపోయింది. విడుదలకు పది రోజుల ముందే అన్నీ పూర్తి చేసాడు దర్శకుడు అనిల్ రావిపూడి. బిజినెస్ మెన్ తర్వాత మహేష్ కెరీర్‌లో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 2, 2020, 6:56 PM IST
సరిలేరు నీకెవ్వరు సెన్సార్ రివ్యూ.. అభిమానులకు ఆ ఒక్కటే భయం..
సరిలేరు నీకెవ్వరు సెన్సార్ టాక్
  • Share this:
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా సెన్సార్ పూర్తైపోయింది. విడుదలకు పది రోజుల ముందే అన్నీ పూర్తి చేసాడు దర్శకుడు అనిల్ రావిపూడి. బిజినెస్ మెన్ తర్వాత మహేష్ కెరీర్‌లో అంత వేగంగా పూర్తైన సినిమా ఇదే. సినిమాలో కామెడీతో పాటు యాక్షన్ కూడా అదిరిపోయేలా ఉండటంతో U/A సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. సినిమా అంతా ఎంటర్‌టైనింగ్‌గా ఉందని.. ఈ సినిమాతో మహేష్ బాబు మరోసారి బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేయడం ఖాయం అని తెలుస్తుంది. టాక్ కూడా పాజిటివ్‌గానే వస్తుంది. అయితే రొటీన్ యాక్షన్ డ్రామా కావడం ఒక్కటే సరిలేరు నీకెవ్వరు సినిమాకు మైనస్ అయ్యేలా ఉందని ప్రచారం జరుగుతుంది.

Mahesh Babu Sarileru Neekevvaru movie censor completed and Will superstar creates history pk సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా సెన్సార్ పూర్తైపోయింది. విడుదలకు పది రోజుల ముందే అన్నీ పూర్తి చేసాడు దర్శకుడు అనిల్ రావిపూడి. బిజినెస్ మెన్ తర్వాత మహేష్ కెరీర్‌లో.. sarileru neekevvaru,sarileru neekevvaru censor,sarileru neekevvaru censor review,sarileru neekevvaru censor talk,mahesh babu sarileru neekevvaru shooting,sarileru neekevvaru shooting wrapped up,sarileru neekevvaru jabardasth comedy show,sarileru neekevvaru anil ravipudi,jabardasth comedians sarileru neekevvaru,chammak chandra sarileru neekevvaru,chammak chandra comedy in sarileru neekevvaru,telugu cinema,jabardasth skits,jabardasth skit in sarileru neekevvaru,rashmika mandanna sarileru neekevvaru,జబర్దస్త్ కామెడీ,సరిలేరు నీకెవ్వరు సెన్సార్ రివ్యూ,జబర్దస్త్ కమెడియన్స్ సరిలేరు నీకెవ్వరు,జబర్దస్త్ కామెడీ షో,చమ్మక్ చంద్ర సరిలేరు నీకెవ్వరు మహేష్ బాబు,తెలుగు సినిమా,ట్రైన్ ఎపిసోడ్ సరిలేరు నీకెవ్వరు
తమన్నా మహేష్ బాబు ఫైల్ పోటోస్


2019 డిసెంబర్ 18తోనే ఈ చిత్ర షూటింగ్‌కు గుమ్మడికాయ్ కొట్టేసిన అనిల్.. విడుదలకు రెండు వారాల ముందే ఫస్ట్ కాపీ కూడా సిద్ధం చేసాడు. 2 గంటల 40 నిమిషాల నిడివితో వస్తుంది సరిలేరు నీకెవ్వరు సినిమా. ఈ చిత్రంలో కామెడీ సీక్వెన్సులు అదిరిపోతాయని.. కడుపులు చెక్కలైపోవడం ఖాయమంటున్నారు చిత్రయూనిట్. ముఖ్యంగా అనిల్ రావిపూడికి కామెడీపై ఉండే పట్టు చూస్తుంటే అదంతా నిజమే అని ఒప్పుకోవాల్సిందే. ఇక ఇప్పుడు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా ఓ హైలైట్ ట్రాక్ రాస్తున్నాడు అనిల్. ఈ సినిమాలో ఒకటి రెండు కాదు.. ఏకంగా 39 నిమషాల పాటు ఓ ట్రైన్ ఎపిసోడ్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది.

Mahesh Babu Sarileru Neekevvaru movie censor completed and Will superstar creates history pk సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా సెన్సార్ పూర్తైపోయింది. విడుదలకు పది రోజుల ముందే అన్నీ పూర్తి చేసాడు దర్శకుడు అనిల్ రావిపూడి. బిజినెస్ మెన్ తర్వాత మహేష్ కెరీర్‌లో.. sarileru neekevvaru,sarileru neekevvaru censor,sarileru neekevvaru censor review,sarileru neekevvaru censor talk,mahesh babu sarileru neekevvaru shooting,sarileru neekevvaru shooting wrapped up,sarileru neekevvaru jabardasth comedy show,sarileru neekevvaru anil ravipudi,jabardasth comedians sarileru neekevvaru,chammak chandra sarileru neekevvaru,chammak chandra comedy in sarileru neekevvaru,telugu cinema,jabardasth skits,jabardasth skit in sarileru neekevvaru,rashmika mandanna sarileru neekevvaru,జబర్దస్త్ కామెడీ,సరిలేరు నీకెవ్వరు సెన్సార్ రివ్యూ,జబర్దస్త్ కమెడియన్స్ సరిలేరు నీకెవ్వరు,జబర్దస్త్ కామెడీ షో,చమ్మక్ చంద్ర సరిలేరు నీకెవ్వరు మహేష్ బాబు,తెలుగు సినిమా,ట్రైన్ ఎపిసోడ్ సరిలేరు నీకెవ్వరు
‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ బాబు,విజయశాంతి (Twitter/Photo)


ఇది కడుపులు చెక్కలైపోయేలా ఉంటుందని.. అప్పట్లో వచ్చిన వెంకీ ట్రైన్ సీక్వెన్స్ కంటే ఇది హైలైట్ అవుతుందని ధీమాగా చెబుతున్నారు సినిమాకు పని చేసినవాళ్లు. ఈ జర్నీలోనే హీరోయిన్ ఫ్యామిలీ అంతా కలిసి హీరోను పడేసి.. తమ అమ్మాయి అంటే మన హీరోయిన్ రష్మికను మహేష్ బాబుకు ఇచ్చి పెళ్లి చేసేందుకు ఎత్తులుంటాయని తెలుస్తుంది. ఈ క్రమంలోనే హి ఈజ్ సో క్యూట్ సాంగ్ వస్తుంది. ఇందులోనే ఓ ఫైట్ కూడా ఉండబోతుంది. ఇక ఇదంతా ఇలా ఉంటే ఈ చిత్రంలో జబర్దస్త్ కమెడియన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండనది తెలుస్తుంది. ట్రైన్ ఎపిసోడ్‌లో జబర్దస్త్ కామెడీ షో నటులు చమ్మక్ చంద్ర, అప్పారావు మధ్య వచ్చే సన్నివేశాలు హిలేరియస్‌గా పేలాయని తెలుస్తుంది.

Mahesh Babu Sarileru Neekevvaru movie censor completed and Will superstar creates history pk సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా సెన్సార్ పూర్తైపోయింది. విడుదలకు పది రోజుల ముందే అన్నీ పూర్తి చేసాడు దర్శకుడు అనిల్ రావిపూడి. బిజినెస్ మెన్ తర్వాత మహేష్ కెరీర్‌లో.. sarileru neekevvaru,sarileru neekevvaru censor,sarileru neekevvaru censor review,sarileru neekevvaru censor talk,mahesh babu sarileru neekevvaru shooting,sarileru neekevvaru shooting wrapped up,sarileru neekevvaru jabardasth comedy show,sarileru neekevvaru anil ravipudi,jabardasth comedians sarileru neekevvaru,chammak chandra sarileru neekevvaru,chammak chandra comedy in sarileru neekevvaru,telugu cinema,jabardasth skits,jabardasth skit in sarileru neekevvaru,rashmika mandanna sarileru neekevvaru,జబర్దస్త్ కామెడీ,సరిలేరు నీకెవ్వరు సెన్సార్ రివ్యూ,జబర్దస్త్ కమెడియన్స్ సరిలేరు నీకెవ్వరు,జబర్దస్త్ కామెడీ షో,చమ్మక్ చంద్ర సరిలేరు నీకెవ్వరు మహేష్ బాబు,తెలుగు సినిమా,ట్రైన్ ఎపిసోడ్ సరిలేరు నీకెవ్వరు
‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి గుమ్మడికాయ కొట్టేసిన చిత్ర యూనిట్ (Twitter/Photo)


ఈ సినిమాలో వాళ్ల ఎపిసోడ్ ఫుల్ మాస్ కామెడీని పుట్టిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక చాలా రోజుల తర్వాత నిర్మాత కమ్ యాక్టర్ బండ్ల గణేష్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో దొంగగా మాంచి ఫన్ అందించాడని ప్రచారం జరుగుతుంది. ఈ కామెడీతో పాటు తమన్నా ఐటం సాంగ్ సినిమాకు మరో ప్లస్. ఎవరెన్ని చేసినా కూడా జబర్దస్త్ నటులతో ఉండే కామెడీ సీక్వెన్సులు మాత్రం అదిరిపోతాయని.. ఇది చూసిన తర్వాత వాళ్లకు మరింత డిమాండ్ పెరిగిపోవడం ఖాయమనే వార్తలైతే వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో జనవరి 11న సరిలేరు నీకెవ్వరు విడుదలైన తర్వాత తెలుస్తుంది.
Published by: Praveen Kumar Vadla
First published: January 2, 2020, 6:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading