MAHESH BABU SARILERU NEEKEVVARU MOVIE 6 DAYS WORLD WIDE COLLECTIONS HERE ARE THE DETAILS TA
సరిలేరు నీకెవ్వరు 6 రోజుల వసూళ్లు.. మొత్తంగా మహేష్ ఎంత వసూలు చేసాడంటే..
సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ (Sarileru Neekevvaru movie 23 days worldwide collections)
సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఈ సంక్రాంతికి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదలైన మొదటి ఆట నుంచే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. మొత్తంగా ఆరు రోజుల్లో సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూలు చేసిందంటే..
సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఈ సంక్రాంతికి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదలైన మొదటి ఆట నుంచే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. తొలిరోజు తెలంగాణ, ఏపీలో కలిపి రూ.32.77 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్, కర్ణాటక రెస్టాఫ్ ఇండియా కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ. 46.7 కోట్ల షేర్ వసూలు చేసి హీరోగా మహేష్ బాబు సత్తా ఏంటో చూపెట్టాడు. మొత్తంగా మూడు రోజుల్లోనే వాల్డ్ వైడ్‌గా రూ. 100 కోట్ల గ్రాస్‌ను వసూళ్లను సాధించింది. మొత్తంగా సంక్రాంతి సెలవులైన భోగి, సంక్రాంతి, కనుమ రోజున వరుసగా రోజుకు రూ. 9 కోట్ల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లను రాబట్టింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 77.18 కోట్ల షేర్ వసూళు చేసిన ఈ చిత్రం.. ఓవర్సీస్, ఇతర ప్రాంతాల్లో కలిపి మొత్తంగా రూ. 94 కోట్ల షేర్ రాబట్టింది. ఒక్క అమెరికా ఇతర దేశాల్లో కలిపి ఈ సినిమాకు 2.5 మిలియన్ డాలర్స్ వసూళ్లు చేసింది. ఒక్క అమెరికా వసూళ్లను చూస్తే.. 2 మిలియన్ డాలర్స్‌కు కాస్త తక్కువగా వచ్చినట్టు బాక్సాఫీస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
మొత్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మొత్తంగా రూ. 100 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా మరో రూ. 6 కోట్లు వసూళ్లు బ్రేక్ ఈవెన్ చేరకుంటుంది. ఈ శనివారం, ఆదివారం కూడా ‘సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెట్టే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే సేఫ్ జోన్లోకి ఎంట్రీ ఇచ్చినట్టే అని ట్రేడ్ రిపోర్ట్ బట్టి చెప్పొచ్చు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.