• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • MAHESH BABU SARILERU NEEKEVVARU MOVIE 4TH TIME ALSO GOOD TRP AND SUPER STAR FANS GET EXCITED TA

Mahesh Babu: మహేష్ బాబు క్రేజ్ పీక్స్‌లో ఉందిగా.. మరోసారి అక్కడ అదరగొట్టిన సూపర్ స్టార్..

Mahesh Babu: మహేష్ బాబు క్రేజ్ పీక్స్‌లో ఉందిగా.. మరోసారి అక్కడ అదరగొట్టిన సూపర్ స్టార్..

మహేష్ బాబు Photo : Twitter

Mahesh Babu:మహేష్ బాబు క్రేజ్ పీక్స్‌లో ఉందిగా.. మరోసారి అక్కడ అదరగొట్టిన సూపర్ స్టార్.. వివరాల్లోకి వెళితే...

  • Share this:
    Mahesh Babu:మహేష్ బాబు క్రేజ్ పీక్స్‌లో ఉందిగా.. మరోసారి అక్కడ అదరగొట్టిన సూపర్ స్టార్.. వివరాల్లోకి వెళితే... తేడాది  సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ’సరిలేరు నీకెవక్వరు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొమ్మ దద్దరిల్లేలా చేసింది.  అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టైటిల్‌కు తగ్గట్టుగానే అన్ని ఏరియాల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్లకు దగ్గర దగ్గరగా షేర్ రాబట్టి ఔరా అనిపించింది. మహేష్ బాబు నటనతో పాటు రష్మిక మందన్న అందాలు ఈ సినిమాకు స్పెషల్‌ ఎస్సెట్‌గా నిలిచాయి. అంతేకాదు ఈ సినిమా మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. బిగ్ స్క్రీన్ పై  సత్తా చాటిన ఈ సినిమా స్మాల్ స్క్రీన్ పై కూడా ఇరగదీసింది. ఆ మధ్య జెమినీ టీవీలో మొదటిసారి ప్రసారమైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా మొదటి సారి 23.4 టీఆర్పీ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

    ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘టెంపర్’ సినిమా జెమిని మొదటిసారి ప్రసారమైనపుడు అత్యధికంగా 29.9 టీఆర్పీ సాధించింది. ఆ తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా 290.4 టీఆర్పీతో రెండో స్థానంలో నిలిచింది.  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమా 24 టీఆర్పీతో మూడో స్థానంలో నిలిచింది. మగధీర 24 టీఆర్పీతో నాల్గో స్థానంలో నిలిచింది.  ఆ తర్వాత మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా మొదటిసారి 23.4 టీర్పీతో ఐదో  స్థానంలో నిలిచింది. ఆ తర్వాత బాహుబలి  2 చిత్రం 22.70 సాధించగా.. బాహుబలి మొదటి పార్ట్ 21.84 రేటింగ్స్‌తో నాలుగు, ఐదో స్థానంలో నిలిచాయి.  తాజాగా స్మాల్ స్క్రీన్ పై రెండోసారి ప్రసారమైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా 17.4 టీర్పీ సాధించడం విశేషం.

    సరిలేరు నీకెవ్వరు: మహేష్ బాబు 


    ఆ తర్వాత మూడోసారి ప్రసారమయినపుడు కూడా 15 టీఆర్పీ సాధించింది. తాజాగా ఈ సినిమా నాల్గోసారి జెమిని టీవీలో ప్రసారమైతే. .10.18 టీఆర్పీతో అదరగొట్టింది. వరుసగా నాల్గోసారి మహేష్ బాబు 10కి పైగా టీఆర్పీ రాబట్టడం విశేషం. గతేడాది సంక్రాంతికి పలకరించిన మహేష్ బాబు.. ఇపుడు పరశురామ్ దర్శకత్వంలో చేస్తోన్న ‘సర్కారు వారి పాట’ మూవీతో మరోసారి సంక్రాంతి బరిలో దూకుడుతున్నాడు. ఈ సినిమాను 2022 పొంగల్‌కు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు