మహేష్ బాబు క్రేజ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. పక్కనున్న కర్ణాటకలో కూడా ఓ రేంజ్లో ఉంది. వివరాల్లోకి వెళితే.. ఈ యేడాది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ’సరిలేరు నీకెవక్వరు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొమ్మ దద్దరిల్లేలా చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టైటిల్‌కు తగ్గట్టుగానే అన్ని ఏరియాల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్లకు దగ్గర దగ్గరగా షేర్ రాబట్టి ఔరా అనిపించింది. మహేష్ బాబు నటనతో పాటు రష్మిక మందన్న అందాలు ఈ సినిమాకు స్పెషల్ ఎస్సెట్‌గా నిలిచాయి. అంతేకాదు ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. బిగ్ స్క్రీన్ పై సత్తా చాటిన ఈ సినిమా స్మాల్ స్క్రీన్ పై కూడా ఇరగదీసింది. ఆ మధ్య జెమినీ టీవీలో మొదటిసారి ప్రసారమైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా మొదటి సారి 23.4 టీఆర్పీ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
సరిలేరు నీకెవ్వరు (sarileru neekevvaru)
స్మాల్ స్క్రీన్ పై రెండోసారి ప్రసారమైనపుడు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా 17.4 టీర్పీ సాధించడం విశేషం. మొత్తంగా వెండితెరపై సూపర్ హిట్టైన ఈ చిత్రం చిన్నతెరపై కూడా ఒకటి రెండు సార్లు సూపర్ హిట్ అవ్వడం మాములు విషయం కాదు. ఐతే.. సరిలేరు నీకెవ్వరు సినిమా తెలుగులోనే కాదు.. పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో కూడా రికార్డు టీఆర్పీ సాధించింది. సరిలేరు నీకెవ్వరు సినిమాను కన్నడలో ‘అజయ్ కృష్ణ’ టైటిల్‌తో డబ్ చేసి రిలీజ్ చేసారు. తాజాగా ఈ సినిమా కన్నడ వెర్షన్‌ను టీవీల్లో ప్రసారమం చేస్తే.. మంచి టీఆర్పీ సాధించింది. అంతేకాదు అక్కడ తెలుగు డబ్బింగ్ చిత్రాల్లో ఆల్ టైమ్ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. కొన్ని రోజులు క్రితం ఈ చిత్రాన్ని కన్నడలో టెలికాస్ట్ చేయ్యగా 6.5 టీఆర్పీ సాధించింది. గతంలో చిరంజీవి నటించిన ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమా 6.3 టీఆర్పీతో నెంబర్ వన్ ప్లేస్‌లో ఉండే. ఇపుడు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాగా మొదటి ప్లేస్‌లో నిలిచింది. మొత్తంగా మహేష్ బాబు తన డబ్బింగ్ చిత్రంతో కూడా అక్కడ రికార్డు నెలకొల్పడం చూసి మహేష్ బాబు అభిమానులు ఆనందపడుతున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.