ప్రస్తుతం తెలుగులో రష్మిక మందన్న హవా నడుస్తోంది. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఒక వైపు గ్లామర్ ఒలకబోస్తూనే.. మరోవైపు నటనకు అవకాశం ఉన్న పాత్రలను చేస్తూ దూసుకుపోతుంది. తాజాగా రష్మిక మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం తెలుగులో రష్మిక మందన్న హవా నడుస్తోంది. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఒక వైపు గ్లామర్ ఒలకబోస్తూనే.. మరోవైపు నటనకు అవకాశం ఉన్న పాత్రలను చేస్తూ దూసుకుపోతుంది. ఈ యేడాది మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో అమాయకంగా ఉంటూనే కన్నింగ్ అండ్ క్యూట్ గర్ల్ పాత్రలో రష్మిక మందన్న ఆకట్టుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైంది. ఆ తర్వాత నితిన్ హీరోగా నటించిన ‘భీష్మ’తో మరో సక్సెస్‌ను అందుకుంది. వరుసగా రెండు సక్సెస్ఫుల్ సినిమాలతో టాలీవుడ్లో దూకుడు చూపిప్తోంది. తాజాగా ఈమె మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అవునండీ.. ఆమె ఆరు నెలలుగా పూర్తిగా వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తీసుకుంటుందట. నిజానికి రష్మికకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టమట. అయినప్పటికీ దానికి పుల్‌స్టాప్ పెట్టేసినట్టు సమాచారం. ప్రస్తుతం హీరోయిన్గా పీక్ స్టేజ్‌లో ఉన్న రష్మక తన ఫిజిక్ కాపాడుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. అంతేకాదు జీవితాంతం శాకాహారిగానే ఉండాలనుకున్నట్టు తన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించిందట.
రీసెంట్గా ఈ బ్యూేటీ ఇటీవలే నాన్‌వెజ్‌తో పోజిచ్చని ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అది ఓ యాడ్ కోసం తీసిన ఫోటో అని చెబుతున్నారు.ఇక రష్మిక శాకాహారిగా మారినట్టు చెప్పిన విషయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఇప్పటికే చాలా కమ్యూనిటీస్‌లో శాకాహారం మాత్రమే తీసుకుంటారు. వాళ్లు ఎందుకు సన్నగా లేరు అనే కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. ఏ ఆహారం తీసుకున్న తగినంత వ్యాయామం చేస్తే సరిపోతుందని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్ సినిమాలో కథానాయికగా నటిస్తోంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.