సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సంక్రాంతి పండుగకు విడుదల చేస్తున్నారు. కాగా సూపర్‌స్టార్ అభిమానులు ఎంతగానో ఎదరుచూస్తున్న ఈ చిత్ర టీజర్ శుక్రవారం విడుదలయ్యింది. టీజర్లో మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో మహేష్ బాబు అదరగొట్టాడు. ఆయన చెప్పిన డైలాగులు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు లేడి సూపర్ స్టార్ విజయశాంతి కూడా అదరగొట్టింది. ఆమె చెప్పిన ‘గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు బాబాయ్’ డైలాగ్ ప్రేక్షక హృదయాలను హత్తుకునేలా ఉంది. మరో నటుడు ప్రకాశ్ రాజ్ చెప్పిన ‘ప్రతి సంక్రాంతికి అల్లుళ్లు వస్తారు. ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు.’ అనే డైలాగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మొత్తంగా చూస్తే ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాను పూర్తిగా మాస్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. ఈ సినిమాను దిల్‌రాజు, మహేశ్‌బాబు, అనిల్ సుంకర కలసి నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. అది అలా ఉంటే నిన్న విడుదలైన టీజర్ యూట్యూబ్‌లో సంచనాలు సృష్టిస్తోంది. టీజర్ యూట్యూబ్‌లో విడుదలైన నిమిషాలలో లక్షల్లో వ్యూస్ అండ్ లైక్స్ సాధించి కొత్త రికార్డులను నమోదు చేసింది. ఈ టీజర్ యూట్యూబ్‌లో ఫాస్టెస్ట్ వన్ మిలియన్ వ్యూస్ సాధించింది. అంతేకాదు ఫాస్టెస్ట్ 10మిలియన్ వ్యూస్, ఫాస్టెస్ట్ 15 మిలియన్ వ్యూస్ సాధించిన టీజర్‌గా కూడా రికార్డు సృష్టించింది. అంతేకాదు ప్రస్తుతం యూట్యూబ్‌లో నంబర్ 1లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్నది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.