సంక్రాంతి వచ్చిందంటే కొత్త సినిమాల కోలాహలం కనిపిస్తుంది. ఒకేసారి రెండు మూడు సినిమాలు వస్తుంటాయి. ప్రతీసారి ఇదే జరుగుతుంటుంది. వచ్చే ఏడాది కూడా ఇదే సీన్ రిపీట్ కాబోతుంది. ఇప్పటికే సంక్రాంతికి రావడానికి రెండు భారీ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. దర్శక నిర్మాతలు కూడా తమ రాకను కన్ఫర్మ్ చేసారు. మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. టీజర్లో కూడా ఇదే విషయాన్ని మరోసారి కన్ఫర్మ్ చేసారు దర్శకుడు అనిల్. దీన్నిబట్టి షూటింగ్ కూడా వేగంగానే పూర్తి చేస్తున్నాడు ఈ కుర్ర దర్శకుడు.

సరిలేరు నీకెవ్వరు లొకేషన్ స్టిల్ (Source: Twitter)
ఇప్పటికే కశ్మీర్ షెడ్యూల్ అయిపోయింది. దాంతో పాటు మరో రెండు మూడు షెడ్యూల్స్ కూడా వేగంగానే పూర్తి చేయనున్నాడు అనిల్. ప్రస్తుతం హైదరాబాద్లోనే ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. అక్కడే మహేష్ బాబుతో పాటు విజయశాంతి కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. ఇక ఇదే సమయంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా కూడా సంక్రాంతికే రానుందని అనౌన్స్ చేసారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ కూడా 30 శాతం పూర్తైపోయింది.

అల్లు అర్జున్, త్రివిక్రమ్
నా పేరు సూర్య తర్వాత బన్నీ చేస్తున్న సినిమా ఇది. ఈ చిత్రానికి వైకుంఠపురంలో అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికే విడుదల చేయాలనుకుంటున్నారు నిర్మాతలు. ఇక ఈ రెండు సినిమాలను జనవరి 11నే తీసుకురావాలనే ప్లాన్ చేయడంతో ఇప్పుడు బన్నీ కాంప్రమైజ్ అయినట్లు తెలుస్తుంది. మూడు రోజులు తన సినిమాను వాయిదా వేసుకుంటున్నాడని తెలుస్తుంది.

మహేష్,. అల్లు అర్జున్ (పైల్ ఫోటోస్)
జనవరి 14న బన్నీ.. జనవరి 10న సరిలేరు నీకెవ్వరు విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. నాలుగు రోజులు గ్యాప్ ఉంటుంది కాబట్టి అప్పటికే కలెక్షన్లు దాదాపు వచ్చేస్తాయి. ఆ తర్వాత పాజిటివ్ టాక్ వస్తే రెండు సినిమాలు భారీ వసూళ్లు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి రాకుండా కాస్త జాగ్రత్త పడి బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నారన్నమాట.
Published by:Praveen Kumar Vadla
First published:August 14, 2019, 13:11 IST