Home /News /movies /

MAHESH BABU SARILERU NEEKEVVARU ANTHEM RELEASED SR

మనసులు దోచుకుంటున్న మహేష్.. సరిలేరు నీకెవ్వరు ఆంథమ్‌..

Twitter

Twitter

మహేష్ బాబు, అనిల్ రావిపూడిల కాంబినేషన్‌లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా నుండి తాజాగా మరో పాట రిలీజ్ అయ్యింది. దీన్నే  ‘సరిలేరు నీకెవ్వరు’ ఆంథమ్‌‌గా పిలుస్తోంది చిత్రబృందం.

    మహేష్ బాబు, అనిల్ రావిపూడిల కాంబినేషన్‌లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా నుండి తాజాగా మరో పాట రిలీజ్ అయ్యింది. దీన్నే  ‘సరిలేరు నీకెవ్వరు’ ఆంథమ్‌‌గా పిలుస్తోంది చిత్రబృందం. ఈ పాటలో ప్రధానంగా సైన్యం, సైనికుల గొప్పతనం, వారి త్యాగాలను గుర్తు చేస్తూ, హత్తుకునే లిరిక్స్ తో నెటిజన్లు ఫిదా చేస్తోంది. ఈ పాట ‘మారణాయుధాలు ఎన్ని ఎదురైనా.. ప్రాణాన్ని ఎదురు పంపేవాడు.. ఒకడే ఒకడు వాడే సైనికుడు..’అంటూ సాగుతూ అదరగొడుతోంది. దేవిశ్రీ మరోసారి తన కంపోజింగ్‌తో అద్భుతం సృష్టించాడు. దీనికి శంకర్‌ మహదేవన్‌ తన గాత్రం పాటకు జీవం పోసింది. ఇక్కడ మరో విషయం ఏమంటే ఈ పాట రాసింది, పాటను కంపోజ్ చేసిందీ దేవిశ్రీనే. మరోవైపు ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ రిలీజ్ అవ్వగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక  నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కనిపించనున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11న భారీ ఎత్తున విడుదలవుతోంది. దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా ఓ అదిరిపోయే పాటలో మెరవనుంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Mahesh babu, Sarileru Neekevvaru

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు