మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ అమెజాన్ ప్రైమ్‌ డేట్ ఫిక్స్..

Sarileru Neekevvaru Amazon Prime Release Date | ఈ మధ్యకాలంలో సినిమావాళ్లకు థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో బాగానే వర్కౌట్ అవుతుంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ వచ్చాకా.. సినిమా థియోటర్స్‌లో నడుస్తూ ఉండగానే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైతున్నాయి. తాజాగా మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు అమెజాన్‌ ప్రైమ్‌ డిజిటల్ ఫ్టాట్‌ఫామ్‌లో ప్రదర్శితమయ్యే తేది ఫిక్స్ అయింది.

news18-telugu
Updated: February 4, 2020, 5:06 PM IST
మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ అమెజాన్ ప్రైమ్‌ డేట్ ఫిక్స్..
మహేష్ బాబు సరిలేరు నీకవెవ్వరు అమెజాన్ ప్రైమ్ రిలీజ్ డేట్ (Twitter/Photo)
  • Share this:
ఈ మధ్యకాలంలో సినిమావాళ్లకు థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో బాగానే వర్కౌట్ అవుతుంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ వచ్చాకా.. సినిమా థియోటర్స్‌లో నడుస్తూ ఉండగానే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైతున్నాయి. ఒక రకంగా డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు బాగానే వర్కౌట్  అయినా.. డిస్ట్రిబ్యూటర్స్‌కు మాత్రం ఒక సినిమా నడుస్తుండగా ‘అమెజాన్’ ప్రైమ్‌లో విడుదల కావడం ఎంతో కొంత నష్టాన్ని తెచ్చిపెడుతోంది. అందుకే ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు  రిలీజ్‌కు ముందు అమెజాన్‌తో ముందే ఒప్పందం చేసుకుంటున్నాయి. తాజాగా మహేష్ బాబు.. హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను మార్చి 7న విడుదలైన 57 రోజులకు అమెజాన్ ప్రైమ్‌‌లో ప్రదర్శితం కానుంది. ఈ సంక్రాంతికి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు సునామినే సృష్టించింది. ఇప్పటికే ఈ చిత్రం రూ. 150కోట్ల షేర్‌తో పాటు రూ. 230 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఇంకా బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్‌‌గా ఉంది. మొత్తంగా ఈ సినిమాను థియేటర్‌లో చూడలేని వాళ్లు అమెజాన్ ప్రైమ్‌లో చూడాలంటే మార్చి 7 వరకు వెయిట్ చేయాల్సిందే.

First published: February 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు