అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ సినిమాను జనవరి 12న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఒక అదే సమయంలో మహేష్ బాబు కూడా తాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను అదే డేట్లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించాడు. ఇలా ఇద్దరు బడా హీరోలు ఒకే రోజున తన సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయడం చూసి ఫిల్మ్ నగర్ వర్గాలు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో అల్లు అర్జున్, మహేష్ బాబు మధ్య దిల్ రాజు రాజీ కుదిర్చినట్టు సమాచారం. దిల్ రాజు, మహేష్ బాబు హీరోగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు ‘అల వైకుంఠపురములో’ సినిమా నైజాం రైట్స్ తీసుకున్నాడు. దీంతో దిల్ రాజు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను జనవరి 13న రిలీజ్ చేయాలని మహేష్ బాబుపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. అంతేకాదు ‘అల వైకుంఠపురములో’ సినిమాను ఒకరోజు ముందుగా జనవరి 11న విడుదల చేసేందుకు అల్లు అర్జున్ టీమ్ వాళ్లను దిల్ రాజు ఒప్పించినట్టు సమాచారం.
అల్లు అర్జున్,మహేష్ బాబు (Twitter/Photo)
మరోవైపు మహేష్ బాబు ఈ సినిమా రిలీజ్ డేట్ ఛేంజ్ చేస్తే..ఈ సినిమాగా నిర్మాతగా తప్పుకున్నట్టు ప్రకటించాడు. దాంతో దిల్ రాజు రంగంలోకి దిగి అల్లు అర్జున్, మహేష్ బాబు మధ్య రహస్య మీటింగ్ అరేంజ్ చేసినట్టు సమాచారం. దీంతో వీళ్లిద్దరు అండర్ స్టాండింగ్‌కు వచ్చి రెండు రోజుల గ్యాప్‌తో వాళ్ల సినిమాలను రిలీజ్ చేసుకునేలా అవగాహన కుదుర్చుకున్నట్టు సమాచారం. మొత్తానికి మహేష్ బాబు, అల్లు అర్జున్‌లు తమ సినిమాల విడుదల విషయంలో ఒక అవగాహనకు వచ్చినట్టు సమాచారం. మరోవైపు జనవరి 15న కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘ఎంతమంచి వాడవురా’ సినిమా విడుదల కానుంది. త్వరలోనే ఈ సినిమాల విడుదల తేదిల విషయంలో అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. గతంలో ‘భరత్ అను నేను’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ విషయంలో ఇద్దరు ఒకే డేట్ విషయంలో పట్టు పట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఒకరు ఒక వారం ముందు.. మరోకరు మరో వారం తర్వాత తమ సినిమాలను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.