• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • MAHESH BABU SAI PALLAVI ROWDY PRAISES SUPER STAR MAHEHS BABU IN THIS WAY TA

Mahesh Babu-Sai Pallavi: మహేష్ బాబు పై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్..

Mahesh Babu-Sai Pallavi: మహేష్ బాబు పై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్..

మహేష్ బాబు, సాయి పల్లవి (File/Photos)

సాధారణంగా అందరూ ఏజ్ పెరుగుతూ ఉంటే.. ముసలివాళ్లు అయిపోతారు. కానీ మహేష్ బాబు మాత్రం వయసు మీద పడుతున్న ఇప్పటికీ కొత్త యవ్వనంతో తొణికిసలాడుతున్నాడు. తాజాగా మహేష్ బాబు అందంపై సాయి పల్లవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Share this:
    సాధారణంగా అందరూ ఏజ్ పెరుగుతూ ఉంటే.. ముసలివాళ్లు అయిపోతారు. కానీ మహేష్ బాబు మాత్రం వయసు మీద పడుతున్న ఇప్పటికీ కొత్త యవ్వనంతో తొణికిసలాడుతున్నాడు. అంతేకాదు ఇపుడొచ్చే కుర్ర హీరోలను సైతం కుళ్లుకునేలా చేస్తున్నాడు. మహేష్ బాబు గ్లామర్ పై సామాన్యులే కాదు.. సినీ ప్రియులను సైతం మహేష్ అందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా టాలెంటెడ్ యాక్ట్రెస్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి మహేష్ బాబును అదే పనిగా పొగడటం మొదలు పెట్టింది. తాజాగా ఈ రౌడీ బేబి ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు అందం గురించి మాట్లాడింది. అంతేకాదు మహేష్ బాబు ఎంతో గ్లామర్‌గా కనిపిస్తారు. ఆయన చర్మంపై చిన్న మచ్చ కూడా  కనిపించదు. ఒక వ్యక్తి ఇంత అందంగా కనిపించడం అసాధ్యమని చెబుతోంది.

    ఒక్కోసారి ఆయన ఫోటోలను నేను జూమ్ చేసి చూస్తుంటాను. ఆయన చర్మంపై ఒక్క చిన్న మచ్చ కూడా కనిపించదంటూ మహేష్ బాబు అందాన్ని తనదైన శైలిలో వర్ణించింది. అంతేకాదు మహేష్ బాబు చర్మం ఎపుడు మెరుస్తూ ఉంటుందని కితాబు ఇచ్చింది. సాయి పల్లవి విషయానికికొస్తే.. ఈమె యాక్ట్ చేసిన రౌడీ బేబి యూబ్యూట్ 1 బిలియన్ వ్యూస్ (100 కోట్ల) మంది వీక్షించిన యూట్యూబ్ వీడియోగా చరిత్ర సృష్టించింది. మొత్తం భారత దేశంలోనే ఈ ఘనత సాధించిన మొదటి సినిమాగా గీతంగా ఇది రికార్డు క్రియేట్ చేసింది.

    Mahesh Babu-Sai Pallavi Rowdy Praises Super Star Mahehs babu In this Way,Mahesh Babu-Sai Pallavi: మహేష్ బాబు పై సాయి పల్లవి ఆసక్తికర కామెంట్స్.. మచ్చలేని వ్యక్తి అంటూ..,Mahesh Babu,Sai Pallavi,Mahesh Babu Sai Pallavi,Mahesh Babu Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata,Sai Pallavi Praises Mahesh babu,Sai Pallavi Twitter,Sai Pallavi Instagram,Mahesh babu Twitter,Mahesh Babu Instagram,Tollywood,Telugu cinema,మహేష్ బాబు,సాయి పల్లవి,సాయి పల్లవి మహేష్ బాబు,మహేష్ బాబు పై సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు,సాయి పల్లవి,మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు,సర్కారు వారి పాట,
    మహేష్ బాబు, సాయి పల్లవి (File/Photos)


    మహేష్ బాబు విషయానికొస్తే..  ఈ యేడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న మహేష్ బాబు.. అదే ఊపులతో పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. కరోనా లేకపోతే.. ఈ పాటికి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ షూటింగ్ కంప్లీటో కూడా అయ్యేది. కానీ ఈ సినిమాను వచ్చే యేడాది జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను అమెరికా నేపథ్యంలో బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబును ఢీ కొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నటిస్తున్నాడు. అంతేకాదు ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ఆగష్టు 7న శ్రీమంతుడు విడులైన రోజునే రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.  ఈ చిత్రంలో మహేష్ బాబు తండ్రి ఇద్దరు కొడుకులుగా త్రిపాత్రాభినయం చేయనున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు