Home /News /movies /

MAHESH BABU REVIEW ON PUSHPA AND SAYS ALLU ARJUN WAS SENSATIONAL AND SUKUMAR RAW AND RUSTIC PK

Mahesh Babu Review on Pushpa: ‘పుష్ప’ సినిమాపై మహేష్ బాబు సెన్సేషనల్ రివ్యూ.. రష్మికను మరిచిపోయాడుగా..!

పుష్ప సినిమాపై మహేష్ బాబు రివ్యూ (Pushpa Mahesh Babu)

పుష్ప సినిమాపై మహేష్ బాబు రివ్యూ (Pushpa Mahesh Babu)

Mahesh Babu Review on Pushpa: ఎప్పటికప్పుడు విడుదలైన కొత్త సినిమాలు చూడటం మహేష్ బాబుకు అలవాటు. ఆయన తీరిక చేసుకుని మరి అన్ని సినిమాలు చూస్తుంటాడు. చూడటమే కాకుండా వాటికి రివ్యూలు కూడా ఇస్తుంటాడు సూపర్ స్టార్. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. తాజాగా ఈయన పుష్ప (Mahesh Babu Review on Pushpa) సినిమా చూసాడు.

ఇంకా చదవండి ...
ఎప్పటికప్పుడు విడుదలైన కొత్త సినిమాలు చూడటం మహేష్ బాబుకు అలవాటు. ఆయన తీరిక చేసుకుని మరి అన్ని సినిమాలు చూస్తుంటాడు. చూడటమే కాకుండా వాటికి రివ్యూలు కూడా ఇస్తుంటాడు సూపర్ స్టార్. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. తాజాగా ఈయన పుష్ప సినిమా చూసాడు. కొన్ని రోజులుగా దుబాయ్‌లోనే కుటుంబంతో పాటు ఉన్నాడు మహేష్. ఆ మధ్య స్పెయిన్‌లో ఈయన కాలికి సర్జరీ జరిగింది. అప్పటి నుంచి ఇండియాకు రాకుండా దుబాయ్‌లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు సూపర్ స్టార్. చాలా రోజులుగా సినిమాలకు దూరంగానే ఉన్న ఈయన.. ఇప్పుడు పుష్ప సినిమా చూసి చాలా ఎగ్జైట్ అయ్యాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు సేఫ్ కాలేదు కానీ మిగిలిన భాషల్లో మాత్రం బ్లాక్‌బస్టర్ అనిపించుకుంది పుష్ప. ముఖ్యంగా హిందీలో అయితే పెట్టిన పెట్టుబడి కంటే రెండింతలు లాభాలు తీసుకొచ్చింది పుష్ప.

కన్నడ, మలయాళం, తమిళంలోనూ పుష్ప సినిమాకు మంచి లాభాలు వచ్చాయి. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ నటనకు అంతా ఫిదా అయిపోయారు. కెరీర్ బెస్ట్ ఇచ్చాడంటూ ఆయన్ని పొగిడేసారు. 2021లో ‘సూర్యవంశీ’ని సైతం అధిగమించి బిగ్గెస్ట్ ఇండియన్ గ్రాసర్‌గా నిలిచింది పుష్ప. తాజాగా ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు రివ్యూ ఇచ్చాడు. సినిమా చూసిన వెంటనే తన స్పందన ట్విట్టర్‌లో పోస్ట్ చేసాడు.

ముఖ్యంగా అల్లు అర్జున్ నటనకు ఫిదా అయిపోయాడు మహేష్. ‘పుష్ప’ సినిమాలో బన్నీ నటన అద్భుతం, సెన్సేషనల్ అండ్ ఒరిజినల్ అంటూ రాసుకొచ్చాడు. మరోవైపు దర్శకుడు సుకుమార్ గురించి చెప్తూ.. రా, రిస్టిక్, బ్రూటల్లీ హొనెస్ట్ అని మళ్ళీ నిరూపించారు అని రాసుకొచ్చాడు. దేవీ శ్రీ ప్రసాద్ పేరు కూడా ప్రత్యేకంగా ప్రస్థావించాడు మహేష్ బాబు.

ఇలాంటి అద్భుతమైన సినిమా చేసినందుకు మైత్రి మూవీ మేకర్స్‌ను చూసి గర్వంగా ఉందని చెప్పాడు మహేష్. సినిమాకు పని చేసిన అందర్ని పేరుపేరునా పొగిడిన మహేష్ బాబు.. హీరోయిన్ రష్మిక మందనను మాత్రం మరిచిపోయాడు. సరిలేరు నీకెవ్వరులో తనతో కలిసి నటించిన హీరోయిన్ గురించి చెప్పడం మరిచిపోయాడు సూపర్ స్టార్. మొత్తానికి పుష్ప సినిమాకు మహేష్ ఇచ్చిన రివ్యూ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఫిబ్రవరి నుంచి ‘పుష్ప ది రూల్’ షూటింగ్ మొదలు కానుంది. 2022 డిసెంబర్‌లో పుష్ప 2 విడుదల కానుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Allu arjun pushpa movie, Mahesh babu, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు