హోమ్ /వార్తలు /సినిమా /

Mahesh Babu: మీ ప్రేమకు ధన్యవాదాలు.. అల్లు అర్జున్ ట్వీట్‌పై మహేష్ బాబు సూపర్ రెస్పాన్స్

Mahesh Babu: మీ ప్రేమకు ధన్యవాదాలు.. అల్లు అర్జున్ ట్వీట్‌పై మహేష్ బాబు సూపర్ రెస్పాన్స్

Photo Twitter

Photo Twitter

Allu Ajun - Mahesh Babu మేజర్ మూవీ చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాపై తన రివ్యూ రాస్తూ పాజిటివ్ కామెంట్స్ చేశారు. ఇవి చూసిన మహేష్ బాబు తాజా రియాక్ట్ అవుతూ మరో సందేశమిచ్చారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణ సారథ్యంలో అడివి శేష్ (Adivi sesh) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'మేజర్' (Major) విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. 26/11 ముంబై ఉగ్ర దాడిలో తుపాకీ తూటాలకు ఎదురెళ్లి జనం ప్రాణాలకు తన ప్రాణాన్ని అడ్డుపెట్టిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Sandeep Unnikrishnan) రియల్ లైఫ్ స్టోరీనే 'మేజర్' సినిమాగా చిత్రీకరించారు దర్శకులు శశి కిరణ్ తిక్కా (Sashi Kiran Tikka). ప్రపంచవ్యాప్తంగా జూన్ 3వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో మేజర్ మూవీ చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఈ సినిమాపై తన రివ్యూ రాస్తూ పాజిటివ్ కామెంట్స్ చేశారు. ఇవి చూసిన మహేష్ బాబు (Mahesh Babu) తాజా రియాక్ట్ అవుతూ మరో సందేశమిచ్చారు.

ఈ మధ్య కాలంలో సినీ హీరోలు సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ అయ్యారు. తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడమే కాకుండా వేరే హీరోల సినిమాలు నచ్చినా కూడా వెంటనే ట్వీట్స్ చేస్తూ వెన్నుతడుతున్నారు. ఈ క్రమంలోనే మేజర్ సినిమాపై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు. మేజర్ మూవీ హార్ట్ టచింగ్ ఫిల్మ్ అని పేర్కొండమే గాక ఇది అడివి శేష్ మ్యాన్ ఆఫ్ షో అని అన్నారు బన్నీ. వెండితెరపై అతని మ్యాజిక్ మరోసారి వర్కవుట్ అయిందని, ప్రకాశ్ రాజ్, రేవతి, సయీ మంజ్రేకర్, శోభిత ధూలిపాళ్లతో పాటు ఆర్టిస్టులంతా బాగా నటించారని తెలుపుతూ ట్వీట్ పెట్టారు.

అంతేకాదు ప్రొడ్యూసర్‌ మహేష్ బాబుకు బిగ్‌ కంగ్రాచ్యులేషన్స్‌ అని తెలిపిన అల్లు అర్జున్.. ప్రేక్షకుల హృదయాలను టచ్ చేసే సినిమా అందించారని తెలిపారు. మేజర్‌ అనేది ప్రతి భారతీయుడి గుండెను తాకే కథ అని పేర్కొన్నారు. దీంతో బన్నీ చేసిన ఈ ట్వీట్ వైరల్ అయింది. అయితే తాజాగా అల్లు అర్జున్ చేసిన ఈ ట్వీట్‌పై ఈ మూవీ నిర్మాత, టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు రియాక్ట్ అయ్యారు. మీ ప్రేమకు ధన్యవాదాలు అని పేర్కొంటూ.. అల్లు అర్జున్ మాటలు మేజర్ టీమ్‌కు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయని అన్నారు మహేష్ బాబు. మేజర్ సినిమా అల్లు అర్జున్‌కు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా‌తో పాటు GMB ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్ పతాకాల సంయుక్త సమర్పణలో రూపొందిన ఈ సినిమాకు శశి కిరణ్ తిక్క (Sashi Kiran Tikka) దర్శకత్వం వహించారు. విడుదలైన తొలి షోతోనే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది. దీంతో అన్ని ఏరియాల్లో కూడా కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటున్నాడు మేజర్.

Published by:Sunil Boddula
First published:

Tags: Adivi Sesh, Allu Arjun, Mahesh Babu, Major Movie

ఉత్తమ కథలు