హోమ్ /వార్తలు /సినిమా /

Mahesh Babu: అభిమానులకు మహేష్ బాబు విజ్జప్తి..

Mahesh Babu: అభిమానులకు మహేష్ బాబు విజ్జప్తి..

సూపర్ స్టార్ మహేష్ బాబు (Twitter/Photo)

సూపర్ స్టార్ మహేష్ బాబు (Twitter/Photo)

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ నెల 9వ తేదిన పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అభిమానులకు మాత్రం ఇది పండగ రోజు. ఈ సందర్భంగా మహేష్ బాబు తన అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశాడు.

    సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ నెల 9వ తేదిన పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అభిమానులకు మాత్రం ఇది పండగ రోజు. ఆ రోజు ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు. ఈ సందర్భంగా మహేష్ బాబు అభిమానులకు ఓ విజ్ఞప్తి చేసాడు. ఎప్పటిలాగే తన పుట్టినరోజును సెలబ్రేట్ చేయవద్దని కోరాడు. కోవిడ్ కారణంగా అభిమానులు సోషల్ డిస్టన్స్ మెయింటేన్ చేయాలని కోరారు. అంతేకాదు తన బర్త్ డే సందర్భంగా ఎలాంటి వేడుకలు చేయద్దని విజ్ఞప్తి చేశాడు. ఈ సందర్భంగా తనకు విష్ చేయడానికి అభిమానులు ఎవరు రావద్దొని రిక్వెస్ట్ చేశాడు. 

    ప్రియమైన అభిమానులుకు.. మీరందరూ నాకు తోడుగా ఉండటం నా అదృష్టం. నా బర్త్ డే ప్రత్యేకంగా ఏదైనా మంచి పని చేయాలని కోరారు. అందుకు మీ అందరినీ అభినందిస్తున్నాను. ప్రస్తుతం మనతో పాటు ప్రపంచం మొత్తం కరోనా అనే మహామ్మారితో పోరాడుతున్నాము. ఈ యుద్ధంలో మనము ఓడిపోకుండా ఉండాలంటే సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేసి క్షేమంగా ఉండాలని కోరకుంటున్నాను. ప్రేమతో మీ మహేష్ బాబు అంటూ ట్వీట్ చేశాడు.  ఇక మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన ఏదైనా కొత్త అప్‌డేట్ ప్రకటించే అవకాశం ఉంది.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Mahesh babu, Sarkaru vaari pata, Tollywood

    ఉత్తమ కథలు