మహేష్ చేతులు మీదుగా విడుదలైన ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ ట్రైలర్..

గత కొన్నేళ్లుగా తెలుగుతో పాటు అన్ని భాషల్లో బయోపిక్‌ల ట్రెండ్  నడుస్తోంది. ఇక తెలుగు విషయానికొస్తే.. ఇప్పటికే మహానటి సావిత్రి, ఎన్టీఆర్ జీవిత చరిత్రలపై సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. తాజాగా వెండితెరపై తెలుగు సినిమా పితామహుడుగా ఖ్యాతి కెక్కిన రఘుపతి వెంకయ్య నాయుడు జీవితాన్ని సినిమాగా తెరకెక్కించారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: November 9, 2019, 2:26 PM IST
మహేష్ చేతులు మీదుగా విడుదలైన ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ ట్రైలర్..
రఘుపతి వెంకయ్య నాయుడు (Twitter/Photo)
  • Share this:
గత కొన్నేళ్లుగా తెలుగుతో పాటు అన్ని భాషల్లో బయోపిక్‌ల ట్రెండ్  నడుస్తోంది. ఇక తెలుగు విషయానికొస్తే.. ఇప్పటికే మహానటి సావిత్రి, ఎన్టీఆర్ జీవిత చరిత్రలపై సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. తాజాగా వెండితెరపై తెలుగు సినిమా పితామహుడుగా ఖ్యాతి కెక్కిన రఘుపతి వెంకయ్య నాయుడు జీవితాన్ని సినిమాగా తెరకెక్కించారు. ఆయన పాత్రలో సీనియర్ నటుడు నరేష్ నటించారు. ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ అనే టైటిల్‌తె తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను హీరో మహేష్ బాబు విడుదల చేసారు.ఈ  సినిమాలో రఘుపతి వెంకయ్య నాయుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమ కోసం చేసిన కృషి, పట్టుదల, తపనను ఈ సినిమాలో చూపెట్టారు. ఈ సినిమాకు  అసలు భారతదేశానికి దాదా సాహెబ్ ఫాల్కే ఎలాగో.. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు రఘుపతి వెంకయ్య నాయుడు అలాగే. బాబ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్ పై మండవ సతీష్ బాబు నిర్మించారు. ఈ సినిమాను ఈ  నెలాఖరు నవంబర్ 29న విడుదల చేయనున్నట్టు ప్రకకటించారు.  ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రల్లో తనికెళ్ల భరణి, మహర్షి,సత్యప్రియ, భావన, శక్తిమాన్, అఖిల్ సన్నీ,దేవ్‌రాజ్ తదితరులు నటించనున్నారు.First published: November 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>