హోమ్ /వార్తలు /సినిమా /

‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహేష్ బాబు ‘పోకిరి’ మాటలు..

‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహేష్ బాబు ‘పోకిరి’ మాటలు..

మహర్షి ప్రీ రిలీజ్ వేడుకలో మహేష్ బాబు

మహర్షి ప్రీ రిలీజ్ వేడుకలో మహేష్ బాబు

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మహేష్ బాబు మాట్లాడిన మాటలు హాట్ టాపిక్‌గా మారాయి.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ సీనియర్ అగ్ర నటుడు వెంకటేష్‌తో పాటు అప్ కమింగ్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేసారు. ‘మహర్షి’ ఈనెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. హీరోగా మహేష్ బాబుకు ఇది 25వ సినిమా. అంతేకాదు ఈ సినిమాను వైజయంతి మూవీస్,శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా బ్యానర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సి.అశ్వనీదత్, దిల్ రాజు, పీవీపీ నిర్మించారు. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అల్లరి నరేష్ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు.ఇక వేడుకలో రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ విడుదలైన 12 గంటల్లోపే  2 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.

ఈ సందర్భంగా మహేష్ బాబు ..తన కెరీర్‌లో బెస్ట్ నిలిచిపోయిన చిత్రాల గురించి  మాట్లాడటం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ‘రాజకుమారుడు’, ‘ఒక్కడు’, ‘అతడు’, ‘శ్రీమంతుడు’,‘భరత్ అను నేను’ సినిమాల గురించి చెప్పిన మహేష్ బాబు.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పోకిరి’ సినిమా గురించి ప్రస్తావించక పోవడం అభిమానులకు ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి మహేష్ బాబును సూపర్ స్టార్‌ను చేసిన చిత్రం ‘పోకిరి’. ఆ తర్వాత  ఈ వేడుకలో ‘పోకిరి’ సినిమా గురించి మాట్లాడలేదనే విషయం గుర్తుకు వచ్చినట్టుంది. వెంటనే మహేష్ బాబు..ట్విట్టర్ ద్వారా పోకిరి చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు.

Missed mentioning an important person in my speech today. In my 25 films journey, it was #Pokiri that made me a Superstar. Thank you so much @purijagan !!! Thanks for giving me Pokiri 🤗 A film that will always be remembered.

— Mahesh Babu (@urstrulyMahesh) May 1, 2019

నా 25 సినిమాల జర్నీలో ‘పోకిరి’ సినిమా  నన్ను సూపర్ స్టార్ చేసింది. నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రమిది అంటూ మహేష్ బాబు దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Maharshi, Maharshi Movie Review, Mahesh babu, Mahesh Babu Latest News, Maheshbabu25, Vamshi paidipally, Venkatesh, Vijay Devarakonda

ఉత్తమ కథలు