MAHESH BABU RARE RECORD HIS SRIMANTHUDU MOVIE SENSATION IN YOUTUBE TA
మహేష్ బాబు మరో రికార్డు.. తెలుగులో ఈ ఫీట్ అందుకున్న మొదటి హీరో..
మహేష్ బాబు (Mahesh Babu) Photo : Twitter
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ యేడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. తాజాగా మహేష్ బాబు ఖాతాలో మరో రికార్డు నమోదు అయింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ యేడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. కథ, కథనాలు రొటిన్‌గా ఉన్న కేవలం మహేష్ బాబు నటించడానే కారణంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైయింది. తాజాగా మహేష్ బాబు ఖాతాలో మరో రికార్డు నమోదు అయింది. 2015లో మహేష్ బాబు.. కొరటాల శివ దర్శకత్వంలో చేసిన శ్రీమంతుడు’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందే సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఊరిని దత్తతకు తీసుకునే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా విడుదల సమయంలోనే చాలా రికార్డులను నమోదు చేసింది. తాజాగా ఈ చిత్రం యూట్యూబ్‌లో మరో రికార్డును అధిగమించబోతుంది. త్వరలో ఈ సినిమా యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ దక్కించుకోబోతుంది. తెలుగులో విడుదలైన ఏ చిత్రం ఇప్పటి వరకు 100 మిలియన్ వ్యూస్ దక్కించుకోలేదు. త్వరలోనే శ్రీమంతుడు సినిమా ఆ ఫీట్ సాధించబోతుంది.
శ్రీమంతుడు సినిమా పోస్టర్ (Source: Twitter)
తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన తెలుగు పాటలతో పాటు హిందీలో డబ్బింగ్ అయిన సినిమాలు మాత్రమే 100 మిలియన్ వ్యూస్‌కు పైగా దక్కించుకున్నాయి. కానీ స్ట్రెయిట్‌గా ఓ తెలుగు చిత్రం యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్‌కు చేరువలో రావడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉన్న మహేష్ బాబు.. త్వరలో పరశురామ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నాడు. ఈ సినిమాను మహేష్ బాబు.. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నట్టు సమాచారం.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.