Mahesh Babu Pokiri@15Years:సూపర్ స్టార్ మహేష్ బాబు, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో వచ్చిన చిత్రం ‘పోకిరి’. ఈ చిత్రం అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాలో ముందుగా హీరోయిన్గా అనుకున్నది ఇలియానాను కాదట.
Mahesh Babu Pokiri@15Years:సూపర్ స్టార్ మహేష్ బాబు, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో వచ్చిన చిత్రం ‘పోకిరి’. ఈ చిత్రం అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం 2006 ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలైంది. ఐతే ఈ చిత్రంలో ముందుగా అనుకున్న కథానాయిక ఇలియానా కాదట.ఈ సినిమాలో మహేష్ బాబు, ఇలియానా కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఇలియానా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా ఇలియానానకు కాకుండా ముందుగా నాగార్జున ‘సూపర్’లో నటించిన అయేషా టకియాను అనుకున్నారు. కానీ అనుకోని కారణాలతో ఆమె ఈ సినిమాలో నటించలేదు. కానీ పోకిరి హిందీ రీమేక్ ‘వాంటెడ్’లో సల్మాన్ సరసన నటించింది.
ఆ తర్వాత అయేషా టకియా ప్లేస్‌లో కంగనా రనౌత్‌ను అనుకున్నారు. ఈ విషయాన్ని కంగనా పలు సందర్భాల్లో ప్రస్తావించింది కూడా. ఆమె గ్యాంగ్స్టర్స్ సినిమా ఆడియన్స్‌కు వెళ్లిన సమయంలో.. పూరీ జగన్నాథ్ ముంబాయిలో పోకిరి సినిమా ఆడిషన్స్ జరగుతున్నాయట. ఆ సమయంలో కంగనా రెండింటికి అటెండ్ అయిందట. ఒకేసారి రెండు సినిమాల్లో ఆమె సెలెక్ట్ అయిందనే విషయాన్ని చెప్పింది. అయితే ముందుగా ‘గ్యాంగ్ స్టర్’ సినిమాకు డేట్లు ఇచ్చేయడంతో ‘పోకిరి’ సినిమా చేయలేకపోయింది. ఐతే.. ముందుగా పూరీ జగన్నాథ్.. ఈ సినిమాను రవితేజ, కంగనా హీరో,హీరోయిన్లుగా ‘ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్య నారాయణ’ టైటిల్‌తో తెరకెక్కిద్దామనుకున్నాడట పూరీ. కానీ ఆ తర్వాత పూరీ ఈ కథను మహేష్ బాబుకు వినిపించి ఓకే చేయించుకుని .. ‘పోకిరి’ టైటిల్‌తో తెరకెక్కించాడు.
15 యేళ్ల ‘పోకిరి’ (Twitter/Photo)
ఒకవేళ కంగనా టాలీవుడ్లో ‘పోకిరి’ సినిమా చేసివుంటే.. ఆమె పెద్ద హీరోయిన్ అయ్యేదని కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించింది. ‘పోకిరి’ సినిమాలో నటించపోయినా కంగనా ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘ఏక్ నిరంజన్’ సినిమాలో యాక్ట్ చేసింది. ప్రస్తుతం జయలలిత జీవితంపై తెరకెక్కుతున్న ‘తలైవి’ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడింది.
కంగనా రనౌత్
ఇక వేళ మహేష్ బాబు ‘పోకిరి’ సినిమాలో కంగనా నటించి ఉంటే ఆమె ప్రతిభ తెలుగు చిత్ర పరిశ్రమకే పరిమితమై ఉండేది. అంతే కాకుండా నటనకు అవకాశం లేకుండా పోయేది. కేవలం గ్లామర్ పాత్రలే చేయాల్సి వచ్చేది. ‘పోకిరి’లో నటించే ఛాన్స్ రాకుండా పోవడం నిజంగా కంగనా అదృష్ణమనే చెప్పాలి. ఈ చిత్రం మిస్ కావడంతో కంగనాకు నటనకు అవకాశం ఉన్న సినిమాలు చేసే అవకాశం వచ్చింది. దాంతో ఆమె నాలుగు సార్లు ఉత్తమ నటిగా జాతీయ అవార్డులు అందుకుంది. దాంతో పాటు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పద్మశ్రీ గౌరవాన్ని అందుకుంది. ఒకవేళ ‘పోకిరి’ సినిమాలో నటించి ఉంటే కంగనాకు నటిగా ఇన్ని అవార్డులు వచ్చేవి కావేమే. ఏమైనా ‘పోకిరి’ సినిమాను మిస్ చేసుకోవడం కంగనా లక్ అనే చెప్పాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.