• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • MAHESH BABU PROVIDE VACCINATION TO WHOLE TEAM FOR SARKARU VAARI PAATA MOVIE HERE ARE THE DETAILS TA

Mahesh Babu - Sarkaru Vaari Paata: ’సర్కారు వారి పాట’ యూనిట్ కోసం మహేష్ బాబు మరో ముందడుగు..

Mahesh Babu - Sarkaru Vaari Paata: ’సర్కారు వారి పాట’ యూనిట్ కోసం మహేష్ బాబు మరో ముందడుగు..

మహేష్ బాబు (Twitter/Photo)

Mahesh Babu - Sarkaru Vaari Paata: ’సర్కారు వారి పాట’ యూనిట్ కోసం మహేష్ బాబు మరో ముందడుగు వేసారు

  • Share this:
    Mahesh Babu - Sarkaru Vaari Paata: ’సర్కారు వారి పాట’ యూనిట్ కోసం మహేష్ బాబు మరో ముందడుగు వేసారు. మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరో, హీరోయిన్లుగా పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే దుబాయ్‌లో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత రెండో షెడ్యూల్‌ను దుబాయ్‌తో పాటు గోవాలో చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా  రెండో షెడ్యూల్‌ కూడా హైదరాబాద్‌లో ప్రారంభించారు. దీని కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ను కూడా ఏర్పాటు చేసారు.  కరోనా సెకండ్ వేవ్ కారణంగా హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసారు.  ఇంతలోనే సర్కారు వారి పాట టీమ్‌లో కొంత మందికి కరోనా పాజిటివ్ తేలడంతో ఈ సినిమా షూటింగ్‌‌ను అర్ధాంతరంగా నిలిపివేసారు.

    ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కాస్త తగ్గు ముఖం పట్టింది. దీంతో హీరోలు ఒక్కొక్కరుగా తమ షూటింగ్స్‌లో పాల్గొనడానికి రెడీ అవుతున్నారు. తాజాగా మహేష్ బాబు.. ’సర్కారు వారి పాట’ షూటింగ్ జూలై నుంచి మొదలు పెట్టనున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌లోని ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేయాలని మహేష్ బాబు డిసైడ్ అయ్యారు. రీసెంట్‌గా తన తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా బుర్రిపాలెం ప్రజలకు ఫ్రీగా వ్యాక్సినేషన్ చేయించారు. మొత్తంగా మహేష్ బాబు .. తన సినిమా యూనిట్ కోసం మంచి అడుగు వేసారనే చెప్పాలి. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక మహేష్ బాబును ఢీ కొట్టే విలన్ పాత్రలో మాధవన్ నటించబోతున్నట్టు సమాచారం. మరో ముఖ్యపాత్రలో నివేదా థామస్ నటించే అవకాశాలున్నాయి.

    mahesh babu twitter,mahesh babu new look,mahesh babu new hairstyle,mahesh babu sarkaru vaari paata,mahesh babu sarkaru vaari paata mass song,sarkaru vaari paata mahesh babu look,mahesh babu new look for sarkaru vaari paata,mahesh babu sarkaru vaari paata new look,mahesh babu family,mahesh new look,మహేష్ బాబు న్యూ లుక్,మహేష్ బాబు కొత్త లుక్ ఫోటోలు,సర్కారు వారి పాట మాస్ సాంగ్ మహేష్ బాబు
    సర్కారు వారి పాట (Twitter/Photo)


    ఈ సినిమాలో మహేష్ బాబు బ్యాంక్ మేనేజర్‌గా నటించనున్నారు. మరోవైపు ఇంకో పాత్రలో కూడా కనిపించనున్నట్టు సమాచారం. కీర్తి సురేష్ కూడా బ్యాంక్ ఉద్యోగి పాత్రలో నటించనున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోంది. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది.

    mahesh babu twitter,mahesh babu new look,mahesh babu new hairstyle,mahesh babu sarkaru vaari paata,mahesh babu sarkaru vaari paata mass song,sarkaru vaari paata mahesh babu look,mahesh babu new look for sarkaru vaari paata,mahesh babu sarkaru vaari paata new look,mahesh babu family,mahesh new look,మహేష్ బాబు న్యూ లుక్,మహేష్ బాబు కొత్త లుక్ ఫోటోలు,సర్కారు వారి పాట మాస్ సాంగ్ మహేష్ బాబు
    మహేష్ బాబు కీర్తి సురేష్ (Mahesh Babu Keethi Suresh)


    వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో హిందీ వర్సటైల్ యాక్టర్ విద్యా బాలన్ నటించనుందని సమాచారం.ఈ సినిమాను జీఎంబీ ప్రొడక్షన్స్, 14 రీల్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: