హోమ్ /వార్తలు /సినిమా /

Sarkaru Vaari Paata Pre Release Business : సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత.. ? హిట్ అనిపించుకోవాలంటే ఎంత రాబట్టాలి..

Sarkaru Vaari Paata Pre Release Business : సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత.. ? హిట్ అనిపించుకోవాలంటే ఎంత రాబట్టాలి..

‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ బిజినెస్ (Twitter/Photo)

‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ బిజినెస్ (Twitter/Photo)

Mahesh Babu - Sarkaru Vaari Paata Pre Release Business | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)  అనే సినిమాతో పలకరించనున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసిందంటే..

ఇంకా చదవండి ...

Mahesh Babu - Sarkaru Vaari Paata Pre Release Business | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)  అనే సినిమాతో పలకరించనున్నారు. ఈ సినిమాకు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మహేష్ బాబుతో మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా తెరకెక్కించారు.  అన్ని కార్యక్రమాలను పూర్తి  చేసుకున్న ఈ సినిమా మే 12 విడుదలకానుంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో పాటు కళావతితో పాటు లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన మ..మ.. మహేషా సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. సర్కారు వారి పాట రన్ టైమ్ 160 నిమిషాలు అంటే దాదాపుగా 2 గంటల 40 నిమిషాలుగా ఉంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బుకింగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. ‘సర్కారు వారి పాట’లో  మహేష్ బాబు ఔట్ అండ్ ఔట్ మాస్ లుక్స్‌తో అదరగొడుతున్నారు. ఈ సినిమాపై మహేష్ బాబు అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ  రేంజ్‌లో జరిగింది. ఏరియా వైజ్‌గా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..

RRR - Nizam All Time Top 10 Share Movies : ఆర్ఆర్ఆర్ సహా నైజాంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ చిత్రాలు ఇవే..


నైజాం (తెలంగాణ):  రూ. 36కోట్లు

సీడెడ్ (రాయలసీమ): రూ.  13 కోట్లు

ఉత్తరాంధ్ర: రూ.  12.50 కోట్లు

ఈస్ట్: రూ. 8.50 కోట్లు

వెస్ట్: రూ. 7 కోట్లు

గుంటూరు: రూ. 9 కోట్లు

కృష్ణా: రూ. 7.5 కోట్లు

నెల్లూరు:రూ. 4 కోట్లు

తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి  రూ. 96.50 కోట్లు

కర్ణాటక : రూ. 8.50 కోట్లు

రెస్టాఫ్ భారత్ : రూ.  3 కోట్లు

ఓవర్సీస్ : రూ. 11 కోట్లు

వాల్డ్ వైడ్‌గా సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ బిజినెస్ .. 120 కోట్లు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 121 కోట్ల షేర్ రాబట్టాలి.ఇక మహేష్ బాబు తన కెరీర్‌లో వరుసగా ‘భరత్ అను నేను’, ‘మహర్షి’, సరిలేరు నీకెవ్వవరు’ వంటి వరుసగా హాట్రిక్స్ హిట్స్ అందుకొని మంచి ఊపు మీదున్నారు. ఇపుడు అదే ఊపులో ‘సర్కారు వారి పాట’ సక్సెస్‌తో మహేష్ బాబు డబుల్ హాట్రిక్ అందుకుంటారా లేదా అనేది చూడాలి. ఈ సినిమాకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఓ వారం రోజుల పాటు టిక్కెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చారు. ఒకవేళ సినిమాకు హిట్ టాక్ వస్తే.. ఈ టికెట్ హైక్స్ బాగానే వర్కౌట్ అవుతోంది. లేకపోతే అంతే సంగతులు అంటున్నారు.

Mothers Day : హీరోల కొడుకులే కాదు.. ఈ హీరోయిన్స్ తనయులు కూడా హీరోలు.. అఖిల్, అభిషేక్ హీరోల లిస్ట్ ఇదే..


ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటిస్తున్నారు. ఈ సినిమా (Sarkaru Vaari Paata) కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం చుట్టూ కేంద్రీకృతమైందని తెలుస్తోంది. సినిమాలో హీరో ఫాదర్‌ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది.ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోందట. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడిన ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఇక ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్‌ (S.SThaman) సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్‌ కె వెంకటేష్ ఎడిటింగ్‌ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్, రాజమౌళి సినిమాల్లో నటించనున్నారు.

First published:

Tags: Keerthy Suresh, Mahesh Babu, Mythri Movie Makers, ParasuRam, Sarkaru Vaari Paata

ఉత్తమ కథలు