సూర్య ప్రధాన పాత్రలో సుధా కొంగర దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆకాశం నీ హద్దురా.. కరోనా లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ ఓపెన్ కాకపోవడంతో ఈ సినిమాను డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్’లో విడుదల చేసింది చిత్రృందం. బందోబస్త్ తర్వాత సూర్య నటిస్తున్న ఈ ఆకాశం నీ హద్దురా.. పై మంచి అంచనాలు ఉన్నాయి. తమిళంలో 'సూరారై పొట్రు'గా తెరకెక్కింది. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీఆర్. గోపినాధ్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపోందింది. సూర్యతో పాటు మోహన్ బాబు కూడా కీలకపాత్రలో కనిపించాడు. అకాశం నీ హద్దురా..ను మే 1న తెలుగు,తమిళ, భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. సూర్య నిర్మిస్తూ నటించిన ఈ సినిమాలో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా చేసింది. గతంలో వెంకటేష్ తో గురు చిత్రాన్ని తెరకెక్కించిన మహిళా దర్శకురాలు సుధా కొంగర ఈ మూవీని డైరెక్ట్ చేసింది. హిందీలో ఈ మూవీని షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. కాగా కరోనా కారణంగా ఈ సినిమా దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 12న డిజిటల్ ప్రీమియర్ గా రిలీజ్ అయ్యింది. ఇక డిజిటల్లో విడుదలైన ఈ చిత్రం మంచి స్పందనను దక్కించుకుంది. మంచి రివ్యూస్ తోడవ్వడంతో ఇండియాలో టాప్‌లో ట్రెండిగ్ అయ్యింది.
చాలా సంవత్సరాల తర్వాత సూర్యకు సాలీడ్ హిట్ పడిందని అంటున్నారు. మహా పాత్రలో సూర్య ఇరగదీశాడని అంటున్నారు. కాగా ఈ చిత్రాన్ని తాజాగా తెలుగు సూపర్ స్టార్ మహేష్ చూశాడు. చూడడం మే కాదు.. ఆ సినిమాలో సూర్య నటనతీరును ప్రశంసించాడు. డైరెక్టర్‌గా సుధా కొంగర అదరగొట్టిందని మెచ్చుకున్నాడు సూపర్ స్టార్.. ప్రస్తుతం దుబాయ్‌లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోన్న మహేష్ ఈ ట్వీట్ చేశాడు. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాటలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చేసంవత్సరం మొదటి వారంలో మొదలుకానుంది. కీర్తి సురేష్ మహేష్‌కు జంటగా నటిస్తోంది.
#SooraraiPottru 👏👏👏 What an inspiring film!! Brilliantly directed with amazing performances... @Suriya_offl in top form😎😎😎Shine on brother...🤗🤗🤗Congrats to the entire team👌👌👌@Aparnabala2 @Sudhakongara_of @gvprakash @nikethbommi
— Mahesh Babu (@urstrulyMahesh) November 18, 2020
ఇక ఆకాశం నీ హద్దురా సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో సూర్య పాత్రకు టాలీవుడ్ యువ నటుడు సత్యదేవ్ డబ్బింగ్ అదరగొట్టాడు. సుధా కొంగర దర్శకత్వం వహించిన 'ఆకాశం నీ హద్దురా'లో సూర్యకు జంటగా అపర్ణ బాలమురళి నటించగా ఇతర ముఖ్య పాత్రల్లో మోహన్‌బాబు, పరేష్ రావల్, ఊర్వశి నటించారు. ఇక ఈ మధ్యే సూర్య బర్త్ డే కానుకగా వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివసల్ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వెట్రిమారన్ ఇటీవల ధనుష్‌తో అసురన్ అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ అవ్వడంతో తెలుగులో నారప్పగా రీమేక్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.