Love Story : లవ్ స్టోరి సినిమాపై మహేష్ బాబు ప్రశంసలు.. నాగ చైతన్య, సాయి పల్లవి అదరగొట్టారు..

మహేష్ బాబు Photo : Twitter

Love Story : అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం “లవ్ స్టోరీ”. ఈ సినిమా మొన్న శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్‌ని తెచ్చుకుంది. దీంతో ఈ సినిమాకు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

 • Share this:
  అక్కినేని హీరో నాగ చైతన్య,  (Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ (love story)అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. లవ్ స్టొరీ వరల్డ్ వైడ్ గా 1000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఊహకందని ఊచకోత కోసింది. ఈ సినిమా మొదటి రోజున 6.94 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా కూడా అదిరిపోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 9.66 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 16.5 కోట్ల మార్క్ ని అందుకుందని అంటున్నారు. దీంతో సినీ ప్రముఖులు సినిమాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. సినిమా అదిరిపోయిందని.. ప్రశంసలు గుప్పించాడు. దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాని చాలా బాగా తెరకెక్కించాడని అన్నారు. ఇక నటుడిగా నాగ చైతన్య మరింత ఎదిగిపోయారని, అద్భుతమైన నటన కనబరిచాడని అన్నారు.

  సాయిపల్లవి నిజంగా ఓ సంచలనం.. తెరపై ఆమెలా డ్యాన్స్ చేసే వారిని చూడలేదని ఒక కలలా ఆమె డాన్స్ చేస్తుందని అన్నారు. ఇక పవన్ సీహెచ్ మ్యూజిక్ స్కోర్ గురించి మాట్లాడుతూ.. ఆయన మ్యూజిక్ ఓ సంచలనమని, రెహమాన్ సార్ శిష్యుడు పవన్ అని విన్నానని ఖచ్చితంగా రెహమాన్ సర్ గర్వపడతారని అన్నారు. నిర్మాతలు నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు‌లకు అభినందనలు తెలియచేశారు.

  Pawan Kalyan - Sai Dharam Tej: సాయి తేజ్ ఇంకా కళ్లు తెరవలేదు.. మీ పెట్టుబడి ఏంటంటూ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఫైర్

  ఇక ఈ లవ్ స్టోరి బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమాను టోటల్ గా 31.2 కోట్లకి అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. ఈ సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే మరో 22.34 కోట్ల షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సంవత్సరంలో ఇంతవరకు ఏ ఇండియన్ సినిమా కూడా కలెక్ట్ చేయని మొత్తాన్ని తన ఖాతాలో వేసకుకుందని తెలుస్తోంది. అమెరికాలో ప్రిమియర్స్ పరంగా 2021లో ఇండియాలో ఏ సినిమాకు రాని కలెక్షన్స్ ఈ లవ్ స్టోరికి వచ్చాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి చిత్రబృందం ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది. అంటే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌కు అన్ని కలెక్షన్స్ రాలేదని అంటున్నారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.  ఈ సినిమాకు ముందు నుంచే పాజిటివ్ టాక్ రావడం మొదలైంది. దీనికి కారణం లేకపోలేదు.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, టీజర్, పాటలు సినిమాపై మరిన్ని అంచనాలు పెంచగా, మొన్న విడుదలైన ట్రైలర్‌కు కూడా భారీ స్పందన లభించింది. మంచి అంచనాలు నెలకొనడంతో చాలా రోజుల తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్‌తో హైదరాబాద్‌లోని థియేటర్స్ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ వారం ముందు నుండే మొదలు అయ్యాయి.

  Akkineni Samantha: అక్కినేని ఫ్యామిలీ డిన్నర్ పార్టీలో సమంత మిస్సింగ్.. విడాకులపై క్లారిటీ ఇచ్చేసిందా?

  నాగచైతన్య ‘మజిలీ, వెంకీ మామ’ లాంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. దీనికితోడు ‘ఫిదా’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో పాటు మరోవైపు సాయి పల్లవి హీరోయిన్ కావడం కారణంగా లవ్ స్టోరీ పై అంచనాలను మరింత పెరిగాయి.

  వీటికి తోడు, ఈ సినిమాలో పాటలు కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉండడం కూడా మంచి పాపులారిటీని తెచ్చింది. ఈ సినిమాలో ఆ మధ్య విడుదలైన తెలంగాణ జానపదం ‘సారంగ దరియా’ సాంగ్ మరో రేంజ్‌ కు తీసుకెళ్ళింది. ఈ పాట ఇప్పటికే  మూడు వందల మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి యూట్యూబ్ లో‌ కొత్త రికార్డులు సృష్టించింది. లవ్ స్టోరిని నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మించారు. పవన్ చిల్లం ఈ సినిమాకు సంగీతం అందించారు. రావు రమేష్, దేవయాని, ఉత్తేజ్, ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలను పోషించారు.
  Published by:Suresh Rachamalla
  First published: