హోమ్ /వార్తలు /సినిమా /

ప్రభాస్,మహేష్ బాబు ఇద్దరి గురి దానిపైనేనా.

ప్రభాస్,మహేష్ బాబు ఇద్దరి గురి దానిపైనేనా.

అవును మహేష్ బాబు, ప్రభాస్ ఇపుడు ఇద్దరు ఒక్క దాన్నే టార్గెట్ చేస్తున్నారు. వీళ్లిద్దరు వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో దిగాలని ఫిక్స్ అయ్యారు.

అవును మహేష్ బాబు, ప్రభాస్ ఇపుడు ఇద్దరు ఒక్క దాన్నే టార్గెట్ చేస్తున్నారు. వీళ్లిద్దరు వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో దిగాలని ఫిక్స్ అయ్యారు.

అవును మహేష్ బాబు, ప్రభాస్ ఇపుడు ఇద్దరు ఒక్క దాన్నే టార్గెట్ చేస్తున్నారు. వీళ్లిద్దరు వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో దిగాలని ఫిక్స్ అయ్యారు.

అవును మహేష్ బాబు, ప్రభాస్ ఇపుడు ఇద్దరు ఒక్క దానికి గురి పెడుతున్నారు.  ప్రస్తుతం మహేష్ బాబు..వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను మే 9న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో కొంచెం శ్రీమంతుడు పోలికలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఈ సినిమాపై ట్రేడ్‌లో చాలా ఆశలున్నాయి. మరోవైపు ప్రభాస్..సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా  చేస్తున్నాడు. ఈసినిమాను పంద్రాగాష్టు కానుకగా రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఇక మహేష్ బాబు..మహర్షి సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో నెక్ట్స్ సినిమా చేయబోతున్నాడు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టేనర్‌గా తెరకెక్కే ఈ సినిమాను త్వరలో సెట్స్ పైకి వెళ్లింది. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈసినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మరో కథానాయికకు ఛాన్స్ ఉంది.  ఈ సినిమాను వచ్చే 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.


ఇంకో వైపు ప్రభాస్ కూడా ‘సాహో’ సినిమాతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈసినిమాను 1970,80 నాటి బ్యాక్ డ్రాప్‌తో ఇటలీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకు ‘జాన్’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమాను కూడా వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అందుకే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను తొందరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక మహేష్ బాబు హీరోగా నటించిన చాలా సినిమాలు సంక్రాంతికి విడుదలైయి చాల మటుకు సక్సెస్ అందుకున్నాయి. ఇక ప్రభాస్ విషయానికొస్తే..‘వర్షం’ తర్వాత మరే సినిమా సంక్రాంతికి విడుదల కాలేదు. ఇపుడు రెండో సారి సంక్రాంతి బరిలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఎక్కడ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడని మహేష్ బాబు, ప్రభాస్‌లు వచ్చే సంక్రాంతికి  బాక్సాఫీస్ దగ్గర సై  అంటే సై అంటున్నారు. మరి వీళ్లిద్దరు నిజంగానే వచ్చే సంక్రాంతికి బరిలో నిలబడతారా లేకపోతే మధ్యలో ఎవరైన మిడిల్ డ్రాప్ అవుతారా అనేది చూడాలి.

First published:

Tags: Maharshi, Mahesh Babu, Mahesh Babu Latest News, Maheshbabu25, Prabhas, Prabhas Latest News, Prabhas20, Saaho, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు