Mahesh Babu - Prabhas: ప్రభాస్‌కు పోటీగా శ్రీ రాముడిగా మహేష్ బాబు... అవును ఇపుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఇదే విషయం మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్.. ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలసిందే కదా. ఈ సినిమా ఓపెనింగ్ రోజే.. సెట్ తగలబడింది. దీంతో ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌కు బ్రేక్ ఏర్పడింది. ఎపుడైతే.. ‘ఆదిపురుష్’ సినిమాను అనౌన్ చేసారో.. అప్పి నుంచి ఈ చిత్రం టాక్ ఆఫ్ ది ఇండియన్ మూవీ అయింది. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాపై పూటకో అప్డేట్ వస్తూనే ఉంది. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో 3Dలో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కోసమే దాదాపు రూ. 200 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు.
మరోవైపు ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. మరోవైపు ఈ చిత్రంలో కీలకమైన రాముడి తండ్రైన దశరథుడి పాత్రలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు టైగర్ ష్రాఫ్ ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్ర కోసం టైగర్ ష్రాఫ్ నటిస్తున్నట్టు సమాచారం. మరోవైపు అజయ్ దేవ్‌గణ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఇక మిగతా నటీనటులను ఆయా ఇండస్ట్రీలో ఫేమసైన వాళ్లను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.

ప్రభాస్ ఆదిపురుష్ ముహూర్తం షాట్ (Instagram/Photo)
మరోవైపు ఈ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ పేరును దాదాపు ఫైనల్ చేసినట్టు సమాచారం. మరోవైపు ఈ చిత్రంలో రావణాసుడి భార్య మండోదరి పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. ఆ పాత్రలో శ్రియ పేరును పరిశీలిస్తున్నారు. ఐతే.. ప్రభాస్ ఆదిపురుష్ కంటే ముందు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, నమిత్ మల్హోత్ర, మధు మంతెనలతో కలిసి మరోసారి రామాయణ గాథను భారీ హంగులతో అంతర్జాతీయ స్థాయిలో త్రీడీలో తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు.

ప్రభాస్, అల్లు అరవింద్ (File/Photo)
ఈ చిత్రానికి ‘దంగల్’ ఫేం నితీశ్ తివారీ, ‘మామ్’ ఫేం రవి ఉద్యవార్లు దర్శకత్వం వహించనున్నారు. మొదటి భాగాన్ని 2021లో విడుదల చేయనున్నట్టు అప్పట్లో ప్రకటించారు. ఆ తర్వాత ఈ చిత్రంలో రాముడు,రావాణాసురుడిగా ఎన్టీఆర్, రామ్ చరణ్, హృతిక్ రోషన్ వంటి నటుల పేర్లు వచ్చినా.. ఆ తర్వాత ఈ చిత్రంపై ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం అల్లు అరవింద్.. త్రివిక్రమ్‌తో మాటలు రాయించారట. ఇప్పటికే లాక్డౌన్లో రామాయణం సినిమాకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్‌ను త్రివిక్రమ్ పూర్తి చేసినట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో టాలీవుడ్, బాలీవుడ్ హీరోల కలయికలో భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబును శ్రీరాముడి పాత్ర కోసం ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. మరోవైపు హృతిక్ రోషన్.. లంకాధిపతి అయిన రావణాసురుడిగా యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

శ్రీరాముడగా మహేష్ బాబు, రావణాసురుడుగా హృతిక్ రోషన్ (File/Photo)
దాదాపు రామయణంలో మహేష్ బాబు శ్రీరాముడిగా ఫైనలైజ్ అయినట్టు సమాచారం. ఈ సినిమాను రాజమౌళి సినిమా తర్వాత పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇక రామాయణం లాంటి గాథకు ఎలాంటి పేటెంట్ హక్కులు లేవు. ఎవరైనా తెరకెక్కించవచ్చు. పౌరాణిక, చారిత్రక కథలకు కాపీ రైట్ హక్కులు లాంటివి ఉండవు కాబట్టి ఎవరైనా ఈ కథతో సినిమాను తెరకెక్కించవచ్చు. మరి ప్రభాస్ అట్టహాసంగా రామాయణ కథపై ఆదిపురుషుడు శ్రీరామచంద్రుడిపై ’ఆది పురుష్’ సినిమా ప్రకటించిన ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ .. రామాయణ గాథను తెరకెక్కించే సాహసం చేస్తాడా అని సందేహం వ్యక్తం చేసారు. కానీ అల్లు అరవింద్.. ప్రభాస్ .. ‘ఆదిపురుష్’కు పోటీగా తన రామాయణం సినిమాను తెరకెక్కించాలనే పట్టుదలతో ఉన్నాడు. తెలుగులో మిగతా స్టార్ హీరోలున్న ప్రభాస్‌లా ప్యాన్ ఇండియా లెవల్లో ఫాలోయింగ్ ఎవరికీ లేదనే చెప్పాలి. కానీ మహేష్ బాబు, హృతిక్ రోషన్ వంటి స్టార్స్‌కు వాళ్ల సొంత భాషలతో పాటు వేరే భాషల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో ఈ సినిమాను ప్యాన్ ఇండియా క్రేజ్ ఉంటుంది.

మహేష్ బాబు వర్సెస్ ప్రభాస్ (Twitter/Photo)
ఒక విధంగా అల్లు అరవింద్.. ప్రభాస్.. ‘ఆదిపురుష్’కు చెక్ పెట్టేవిధంగా తన రామాయణం మూవీని ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇక ప్రభాస్.. ‘ఆదిపురుష్’ 2022లో విడుదలయ్యే అవకాశం ఉంది. అల్లు అరవింద్ తన సినిమాను తెరకెక్కించే రామాయణం పట్టాలెక్కేవరకు 2022 పట్టే అవకాశం ఉంది. సినిమా రిలీజయ్యే వరకు ఎంత లేదన్న 2024 పట్టొచ్చు. దీంతో ప్రభాస్..ఆదిపురుష్‌తో అల్లు అరవింద్, మహేష్ బాబు, హృతిక్ రోషన్ కలయికలో వస్తోన్న ‘రామాయణం’ పోటీ పడే అవకాశాలు లేకపోవచ్చు. పైగా అల్లు అరవింద్ తన సినిమాను మూడు పార్టులుగా తెరకెక్కించబోతున్నట్టు చెప్పాడు. ఏమైనా అల్లు అరవింద్ తన ఫ్యామిలిలో చాలా మంది హీరోలున్న మహేష్ బాబుతో ఈ సినిమాను తెరకెక్కించాలనుకోవడం విశేషం. ఏమైనా అయోధ్య రామజన్మభూమిలో రామాలయం నిర్మిస్తున్న ఈ శుభవేళలో సినిమా వాళ్లు రామాయణ గాథపై సినిమాలు తెరకెక్కిస్తుండం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొత్తంగా ఇపుడు సినీ ఇండస్ట్రీ రామాయణ గాథపై పడ్డారు. మరోవైపు అప్పట్లో మంచు ఫ్యామిలీ మోహన్ బాబు హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘రావణబ్రహ్మ’ సినిమాను అనౌన్స్ చేసి.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయిన సంగతి తెలిసిందే కదా.