హోమ్ /వార్తలు /సినిమా /

‘సర్కారు వారి పాట’లో మహేష్ బాబు తొలిసారి ఆ ప్రయోగం చేయబోతున్నాడా..

‘సర్కారు వారి పాట’లో మహేష్ బాబు తొలిసారి ఆ ప్రయోగం చేయబోతున్నాడా..

అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికీ మొదలు కాలేదు.. డిసెంబర్ వరకు మొదలు కాదు కూడా. ఎందుకంటే కోవిడ్ కొలిక్కి వచ్చే వరకు తాను ఇంటి నుంచి అడుగు బయట పెట్టేది లేదని ఇప్పటికే మహేష్ బాబు తన టీంకు చెప్పేసాడు కూడా.

అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికీ మొదలు కాలేదు.. డిసెంబర్ వరకు మొదలు కాదు కూడా. ఎందుకంటే కోవిడ్ కొలిక్కి వచ్చే వరకు తాను ఇంటి నుంచి అడుగు బయట పెట్టేది లేదని ఇప్పటికే మహేష్ బాబు తన టీంకు చెప్పేసాడు కూడా.

ఈ యేడాది  అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత మహేష్ బాబు.. పరశురామ్ దర్శత్వంలో ‘సర్కారు వారి పాట’ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. ఈ సినిమాలో మహేష్ బాబు తొలిసారి..

    ఈ యేడాది  అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత మహేష్ బాబు.. పరశురామ్ దర్శత్వంలో ‘సర్కారు వారి పాట’ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. అంతేకాదు తన తండ్రి సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసాడు. ఈ సినిమాలో ముఖ్యంగా అవినీతికి సంబంధించిన ఓ సామాజిక అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఈ సినిమాలో వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని హీరో మహేష్ ఎలా తిరిగి రాబట్టాడు. దానికి సంబందించి ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది.ఈ సినిమాలో మహేష్ బాబును ఢీ కొట్టే విలన్ పాత్రలో సుదీప్, ఉపేంద్ర, అరవింద్ స్వామి పేర్లను పరిశీలిస్తున్నారు. ఫైనల్‌గా ఎవరనేది చూడాలి.

    మహేష్ బాబు సర్కారు వారి పాట లుక్ (sarkaru vaari pata movie)
    మహేష్ బాబు సర్కారు వారి పాట లుక్ (sarkaru vaari pata movie)

    మరోవైపు ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్‌తో పాటు నివేదా థామస్ పేర్లను పరిశీలిస్తున్నారు.ఐతే.. ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రి కొడుకులుగా త్రిపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. మహేష్ బాబు కెరీర్ విషయానికొస్తే.. చిన్నపుడు తన తండ్రి కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమాలో డ్యూయల్ రోల్లో నటించాడు. ఆ తర్వాత ఎస్.జే.సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాని’ చిత్రంలో చివరి సన్నివేశంలో తండ్రి కొడుకులుగా కనిపించి కాసేపు ప్రేక్షకులను ఆనంద పరిచాడు.

    Mahesh babu to play dual role in vamsi paidipally movie here are the details,Mahesh babu,Mahesh babu dual role,mahesh babu first time play dual role,mahesh babu,mahesh babu sarileru neekevvaru,sarileru neekevvaru collections,mahesh babu vamshi paidipally,tollywood,telugu cinema,మహేష్ బాబు,సరిలేరు నీకెవ్వరు,మహేష్ బాబు డ్యూయల్ రోల్,మహేష్ బాబు ద్విపాత్రాభినయం,రెండు పాత్రల్లో మహేష్ బాబు,మహేష్ బాబు వంశీ పైడిపల్లి,మహేష్ బాబు వంశీ పైడిపల్లి మహర్షి
    నాని సినిమాలో తండ్రి కొడుకులుగా మహేష్ బాబు డ్యూయల్ రోల్ (youtube/Photo)

    ఇప్పటి వరకు మహేష్ బాబు పూర్తి స్థాయిలో ద్విపాత్రాభినయం చేయలేదు. ఆ లోటును ‘సర్కారు వారి పాట’ మూవీతో భర్తీ చేయనున్నట్టు సమాచారం. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్‌తో పాటు మహేష్ బాబు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. మొత్తంగా ఇన్నేళ్ల కెరీర్‌లో ఇప్పటి వరకు చూడని క్యారెక్టర్‌లో మహేష్ బాబు ఎలాంటి అద్భుతాలు చేస్తాడో చూడాలి.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Mahesh babu, Nivetha Thomas, ParasuRam, Sarkaru vaari pata, Tollywood

    ఉత్తమ కథలు