• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • MAHESH BABU PARASURAM SARKARU VAARI PATA MOVIE RELEASE DATE CONFIRMED AND ON THE WAY TO SANKRANTI 2022 PK

Sarkaru Vaati Pata: ‘సర్కారు వారి పాట’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరోసారి సంక్రాంతికి వస్తున్న మహేష్ బాబు..

Sarkaru Vaati Pata: ‘సర్కారు వారి పాట’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరోసారి సంక్రాంతికి వస్తున్న మహేష్ బాబు..

సర్కారు వారి పాట రిలీజ్ డేట్ (Sarkaru Vaari Pata movie)

Sarkaru Vaati Pata: తెలుగు ఇండస్ట్రీలో సంక్రాంతి హీరో అని అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణకు పేరుండేది. ఆయన నటించిన చాలా సినిమాలు పండక్కి వచ్చి రికార్డులు తిరగరాసాయి. ఇప్పుడు ఆయన వారసుడు మహేష్ బాబు కూడా పండగనే బాగా నమ్ముకుంటున్నాడు.

  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో సంక్రాంతి హీరో అని అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణకు పేరుండేది. ఆయన నటించిన చాలా సినిమాలు పండక్కి వచ్చి రికార్డులు తిరగరాసాయి. ఇప్పుడు ఆయన వారసుడు మహేష్ బాబు కూడా పండగనే బాగా నమ్ముకుంటున్నాడు. ఎక్కువగా సంక్రాంతికే వస్తున్నాడు ఈయన. అప్పుడెప్పుడో ఒక్కడు లాంటి ఇండస్ట్రీ హిట్ నుంచి నిన్నమొన్నటి సరిలేరు నీకెవ్వరు వరకు కూడా ఎన్నో విజయాలు పండక్కి వచ్చి అందుకున్నాడు మహేష్ బాబు. ఇప్పుడు మళ్లీ పండక్కే రానున్నాడు సూపర్ స్టార్. తాజాగా ఈయన నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా సంక్రాంతి 2022కు విడుదల కానుంది. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మధ్యే దుబాయ్‌లో రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. గీత గోవిందం లాంటి సంచలన బ్లాక్‌బస్టర్ తర్వాత పరశురామ్ దాదాపు మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ఇది. తొలిసారి మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్‌ను డైరెక్ట్ చేసే అవకాశం రావడంతో గాల్లో తేలిపోతున్నాడు పరశురామ్. బ్యాంకులో జరిగే ఆర్థిక నేరాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని ప్రచారం జరుగుతుంది. ఇందులో బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ విలన్‌గా నటించబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి.
sarkaru vaari pata movie,mahesh babu sarkaru vaari pata movie,mahesh babu twitter,sarkaru vaari pata movie mahesh babu shooting,sarkaru vaari pata movie release date,telugu cinema,mahesh babu parasuram movie,సర్కారు వారి పాట,సర్కారు వారి పాట సంక్రాంతి విడుదల,మహేష్ బాబు సంక్రాంతి
సర్కారు వారి పాట రిలీజ్ డేట్ (Sarkaru Vaari Pata movie)

తండ్రీ కొడుకు సెంటిమెంట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు పరశురామ్. కచ్చితంగా ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోతానని ధీమాగా చెప్తున్నాడు ఈయన. సంక్రాంతికి వచ్చి సంచలనం సృష్టించాలని కలలు కంటున్నాడు ఈ దర్శకుడు. తాజాగా సర్కారు వారి పాట రిలీజ్ డేట్ ఖరారు కావడంతో వచ్చే పండక్కి ఇప్పట్నుంచే పోటీ మొదలైపోయింది.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు