• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • MAHESH BABU PARASURAM SARKARU VAARI PAATA LATEST UPDATE SHOOT STARTS FROM OCTOBER SR

Mahesh Babu : అక్టోబర్‌లో సర్కారు వారి పాట షూటింగ్.. మహేష్ బాబు డ్యుయల్ రోల్..

సర్కారు వారి పాట పోస్టర్ Photo : Twitter

Mahesh Babu : మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్లో రూపొందే 'సర్కారు వారి పాట' చిత్రం ఫస్ట్ షెడ్యూలు షూటింగ్ అక్టోబర్ నుంచి మొదలుకానుంది. ఈ సినిమాలో మహేష్ డబుల్ రోల్ చేయనున్నట్టు తెలుస్తోంది.

  • Share this:
    మహేష్ బాబు ఇటీవల పరుశురామ్ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట పేరుతో వస్తోన్న ఈ సినిమాను పరుశురామ్ సోషల్ మెసేజ్‌ కథతో తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో ముఖ్యంగా బ్యాకింగ్ రంగంలో అవినీతికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఈ సినిమాలో వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని హీరో మహేష్ ఎలా తిరిగి రాబట్టాడు. దానికి సంబందించి ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది. ఇక మరోవైపు సోషల్ మెసేజ్‌తో పాటు అదిరిపోయే రొమాంటిక్ సీన్స్ ఉంటాయట. అందులో భాగంగా చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్‌ గా నటించనున్నాడని తెలుస్తోంది. కాగా మొదటి నుండి ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారాను అనుకున్నారు. అయితే ఆమె హిందీలో బిజీగా ఉండడంతో కీర్తి సురేష్‌‌కు చిత్రబృందం ఫిక్స్ అయ్యింది.

    ప్రస్తుతం స్క్రిప్ట్ పనులను పూర్తి చేసి.. షూటింగ్‌కు రెడీ అవుతోంది చిత్రబృందం. అందులో భాగంగా తొలి షెడ్యూలు షూటింగును అక్టోబర్ నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారట. ప్రభుత్వం కూడా అనుమతులు ఇవ్వడంతో ఇక ఆలస్యం చేయకుండా షూటింగ్ రెడీ అవుతోందట చిత్రబృందం. ఇందులో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇక ఈ సినిమాలో మహేష్ లుక్ గురించి రకరకాల రూమర్స్ వస్తున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత మహేష్ ఈ సినిమా కోసం తన లుక్‌ను మార్చనున్నాడట. అందులో భాగంగా సినిమా ప్రకటన నేపథ్యలో విడుదలైన ఆ పోస్టర్‌లో మహేష్ చాలా కొత్తగా.. న్యూ హేయిర్ స్టైల్‌లో కనబడుతూ అదరగొట్టాడు. అయితే ఆయన ఇలా ఓ సినిమాకు తన లుక్‌ను మార్చింది మాత్రం పూరి జగన్నాధ్ పోకిరి సినిమాకే. ఆ సినిమా మహేష్ బాబును సూపర్ స్టార్ ను చేసింది. ఆయన కేరీర్‌లో ఫస్ట్ టైమ్ ఆ సినిమాలో డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఆ సినిమా అంత హిట్ అవ్వడానికి మహేష్ లుక్ కూడా ఒక కారణం అంటారు ఆయన అభిమానులు. ఆ సినిమా తర్వాత మరే సినిమాకు ఆయన మరో సారి తన లుక్‌ను మార్చలేదు.

    కాగా మళ్ళీ ఇన్నేళ్లు తరువాత మహేష్ కొత్త లుక్‌తో వస్తున్నాడు. దీంతో ఈ సినిమా పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా కూడా మహేష్ కెరీర్‌లో మరో మరిచిపోలేని సినిమాగా ఉండబోతున్నదని భావిస్తున్నారు అభిమానులు. సర్కారు వారి పాట ప్రీ లుక్ పోస్టర్ లో ఉంగరాల జుట్టుతో కనిపించిన మహేష్.. షూటింగ్ మొదలు అవుతుందన్న సమయంలో లాంగ్ హెయిర్ స్ట్రెయిట్ లుక్‌లో దర్శనమివ్వనున్నాడని తెలుస్తోంది. అంటే మళ్ళీ పోకిరి సైనికుడు తరహా స్టైల్లో ప్లాన్ చేస్తున్నాడట. చూడాలి మరి ఈ లుక్‌లో మహేష్ ఏ విధంగా కనిపించనున్నాడో.. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.
    Published by:Suresh Rachamalla
    First published: