Happy Birthday Rajamouli: రాజమౌళికి బర్త్ డే విషెస్ తెలిపిన మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్..

Rajamouli Photo : Twitter

Happy Birthday Rajamouli | తెలుగు సినిమా మేకింగ్ స్టైల్ మార్చిన విక్రమార్కుడు. తెరపై అన్ని రసాలను సమపాళ్లలో రంగరించి చూపించే మర్యాద రామన్న కూడా అతడే. మాస్ పల్స్ తెలిసిన దర్శక ఛత్రపతి. ఈ రోజు రాజమౌళి తన 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ సెలెబ్రిటీస్‌తో పాటు సామాన్యులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 • Share this:
  Happy Birthday Rajamouli | తెలుగు సినిమా మేకింగ్ స్టైల్ మార్చిన విక్రమార్కుడు. తెరపై అన్ని రసాలను సమపాళ్లలో రంగరించి చూపించే మర్యాద రామన్న కూడా అతడే. మాస్ పల్స్ తెలిసిన దర్శక ఛత్రపతి. హీరోయిజాన్ని పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేసి కథానాయికుడు ఇమేజ్ ను పెంచే దర్శకధీరుడు. తెలుగు సినిమా రేంజ్ ను ప్రపంచవ్యాప్తం చేసిన బాహుబలి. హీరోలతో సమానమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న క్రేజీ డైరెక్టర్. ఆయనే దర్శకమౌళి...రాజమౌళి. నేడు ఈ సూపర్ సక్సెస్ డైరెక్టర్ బర్త్ డే ...రాజమౌళి సినిమా అంటే ఆడియన్స్ కొన్న టికెట్ కు సరిపడా వినోదం గ్యారంటీ. తొలి సినిమా స్టూడెంట్ నెం.1 నుండి బాహుబలి 2 వరకు ప్రతి సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూనే ఉన్నారు. బాహుబలి సిరీస్‌తో హోల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని టాలీవుడ్‌ వైపు తిరిగిచూసేలా చేసారు. తెలుగు వాడి సత్తాను జాతీయ..అంతర్జాతీయ స్థాయిలో రెప రెపలాడించారు. కథ ఏదైనా.. హీరో ఎవ్వరైనా సరే బాక్సాఫీస్ బద్దలు కావల్సిందే.

  ఈ రోజు రాజమౌళి తన 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ సెలెబ్రిటీస్‌తో పాటు సామాన్యులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

  ఇక ఆయన దర్శకత్వం వహిస్తున్న ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) విషయానికి వస్తే.. (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. కరోనా కేసులు తగ్గడంతో ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోందని గతంలో ప్రకటించగా.. కరోనా నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేశారు.

  MAA Elections:పోలింగ్ రద్దు.. ఫలితాల్లేవు.. కోర్టులో చూసుకుందాం అంటూ ఎన్నికల అధికారి వార్నింగ్.. టెన్షన్

  అయితే ప్రస్తుతం ఇటు కరోనా కేసులు తగ్గడంతో పాటు అటు ఏపీలో కూడా టికెట్ రేట్ల విషయంలో త్వరలో క్లారిటీ రానున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల తేదిని మరోసారి ప్రకటించారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. అయితే ఈ సినిమా తాజాగా ప్రకటించిన ఈ డేట్‌కు కూడా విడుదలయ్యే అవకాశాలు తక్కువుగా ఉన్నాయని తెలుస్తోంది.

  ఈ సినిమా జనవరి 7న కాకుండా జనవరి 26న (RRR Release Date) విడుదలకానుందని తాజాగా వినిపిస్తోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26కి విడుదల అవుతుందని సమాచారం. ఆ డేట్ అయితే సినిమా జానర్‌కు కూడా సరిగ్గా సరిపోతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

  MAA Elections: శివ బాలాజీ చెయ్యి కొరికిన నటి హేమ.. 'మా' ఎన్నికల్లో రచ్చ.. రచ్చ..

  ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. సిరివెన్నెల సీతరామశాస్త్రీ రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టారు.

  ఇక ఈ సినిమా నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది.

  ఎం.ఎం. కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
  Published by:Suresh Rachamalla
  First published: