హోమ్ /వార్తలు /సినిమా /

Mahesh Babu: అబ్బబ్బబ్బా.. ఆ స్మైల్ ఏందిరా బాబు... ఎవడైనా ఫిదా అవ్వాల్సిందే!

Mahesh Babu: అబ్బబ్బబ్బా.. ఆ స్మైల్ ఏందిరా బాబు... ఎవడైనా ఫిదా అవ్వాల్సిందే!

మహేష్ బాబు నవ్వు

మహేష్ బాబు నవ్వు

బిత్తిరి సత్తితో జరిగిన ఇంటర్వ్యూలో ఓ డబుల్ మీనింగ్ డైలాగ్‌కు మహేష్ బాబు నాన్ స్టాప్‌గా నిమిషం పాటు నవ్వుతూనే ఉన్నాడు. ఇప్పుడా ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతొంది.

టాలీవుడ్ రాజకుమారుడు ఎవరు అంటే.. టక్కున వచ్చే పేరు మహేష్ బాబు. నిజంగా ఆ పేరులోనే ఏదో మ్యాజిక్ ఉంది. ఆ నవ్వులోనే ఓ మ్యూజిక్ ఉంది. ఇది మహేష్ అభిమానుల మాట. ఆయన నటనకే కాదు.. ఆయన నవ్వుకు... ఆయన సింపుల్ సిటీకి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మహేష్ అంటే పడిచచ్చే డై హార్డ్ ఫ్యాన్స్ వేలల్లో ఉన్నారు. అయితే మహేష్ ఎంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ.. ఎక్కడా ఆ హంగు ఆర్భాటాలు కనిపించవు. ఎప్పుడూ చూసినా చాలా ప్రశాంతంగా నవ్వుతో... కనిపిస్తాడు. బయటకు వస్తే.. మిస్టర్ కూల్ లెక్క.. చాలా క్యూట్‌గా అనిపిస్తాడు. అయితే ఇటీవల మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్లలో మహేష్ చాలా బిజీగా మారాడు. వరుసగా అన్నీ మీడియా ఛానల్స్‌కు.. ఇంటర్వ్యూలు ఇచ్చాడు.

అయితే బిత్తిరి సత్తితో మహేష్ చేసిన ఇంటర్వ్యూ మాత్రం హైలట‌్‌ అయ్యింది. ఎందుకంటే ఈ ఇంటర్య్వూలో మహేష్ నాన్ స్టాప్‌గా నవ్వడమే కారణం. బిత్తిరి సత్తి మాటలకు మహేష్ మామూలుగా నవ్వలేదు. మన మాటల్లో చెప్పాలంటే పడి పడ నవ్వాడన్నమాట. అయితే మహేష్ బాబున అంతలా నవ్వడం ఎప్పుడూ చూడలేదు. మనసు నిండా .. నవ్వు ఆపుకోలేక.. నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉన్నాడు. అయితే టాలీవుడ్ అందగాడి నవ్వు చూసిన .. ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. మహేష్ నవ్వుపై అదిరిపోయే కామెంట్స్ పెడుతున్నారు. బిత్తిరి సత్తితో జరిగిన ఇంటర్వ్యూలో ‘వంద గోలీలు వేసుకున్న పెళ్లికొడుకు దగ్గరకు వచ్చినట్లు వచ్చిన్నా’ అంటూ బిత్తిరి సత్తి అనగానే.. మహేష్ ఆమాటకు పడి పడి నవ్వాడు. వందగోలీలు వేసుకున్న పెళ్లికొడుకు ఏంట్రా అంటూ నవ్వు ఆపుకోలేకపోయాడు. ఇక బిత్తిరి సత్తి మట్లాడుతూ.. ఫస్ట్ టైం మాస్ డైలాగ్స్ విని అందరూ... అరే చెవులుకొరుక్కుంటున్నారు అంటూ.. బిత్తిరి సత్తి మహేష్‌తో చెబుతుంటే.. మహేష్ నవ్వుతూనే ఉన్నాడు.  అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోపై అభిమానులు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.


‘నీ నవ్వు వరం.. నా కోపం శాపం.. నామాట శాసనం దొర అని ఓ నెటిజన్ కామెంట్ పెడితే.. మహేష్ అన్న అంతలా నవ్వడం ఫస్ట్ టైం చూస్తున్నామని మరో నెటిజన్ పోస్టు చేశాడు. (నజర్ నా లగే) దిష్టి తగలకూడదు అని మరో నెటిజన్ అన్నారు. బ్యూటిఫుల్ స్మైల్ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి ఇంకో నెటిజన్ పోస్టు పెట్టారు. ‘అబ్బబ్బబ్బా ఆ స్మైల్ ఏందిరా బాబు. అసలు అన్నాయ్య... ఎవడైనా ఫిదా అవ్వాల్సిందే’ అంటూ కిస్సింగ్ ఎమోజీలు... పోస్టు చేశారు మరో నెటిజన్. ఇలా మహేష్ నవ్వుకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. మహేష్ బాబు నవ్వుకు అంతా సంబరపడిపోతున్నారు.

First published:

Tags: Mahesh Babu, Sarkaru Vaari Paata

ఉత్తమ కథలు