Mahesh Babu: మంచు విష్ణుకు థ్యాంక్స్ చెబుతున్న మహేశ్ ఫ్యాన్స్.. అసలు కారణం ఇదే..

మంచు విష్ణు (File/Photo)

Mahesh Babu: సర్కారువారి పాట అంటూ ఎవరూ ఊహించని టైటిల్‌తో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్న మహేశ్ బాబు.. ఈ సినిమాలో కాస్త డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తాడని టాక్ వినిపించింది.

  • Share this:
    గతేడాది సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తన తదుపరి సినిమాను పరశురాం డైరెక్షన్‌లో చేసేందుకు కమిటయ్యాడు. సర్కారువారి పాట అంటూ ఎవరూ ఊహించని టైటిల్‌తో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్న మహేశ్ బాబు.. ఈ సినిమాలో కాస్త డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తాడని టాక్ వినిపించింది. అయితే కొత్త సినిమాలకు సంబంధించిన లుక్‌ను మన హీరోలు అంత తొందరగా రివీల్ చేయరు కాబట్టి.. నయా మూవీలో మహేశ్ బాబు లుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే అని అభిమానులు భావించారు.

    అయితే టాలీవుడ్ హీరో మంచు విష్ణు కారణంగా మహేశ్ బాబు నయా లుక్ తెలిసిపోయింది. మంచు విష్ణు విరోనికా బర్త్ డే సందర్భంగా ఇచ్చిన పార్టీకి హాజరైన మహేశ్ బాబు.. వారితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. వాటిని ట్విట్టర్‌లో షేర్ చేసిన మంచు విష్ణు.. మహేశ్ బాబుపై పొడగ్తలు కురిపించారు. అయితే ఈ ఫోటోల్లో మహేశ్ బాబు న్యూ లుక్ తెలిసిపోయిందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

    నవంబర్‌లో అఫీషియల్‌గా ప్రారంభోత్సవం జరుపుకున్న సర్కారువారి పాట సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఈ నెలాఖరు నుంచి మొదలుకానుంది. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఎక్కువ భాగం అమెరికాలో జరగనుందని వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన కీర్తీ సురేశ్ హీరోయిన్‌గా నటించనుంది.
    Published by:Kishore Akkaladevi
    First published: