హోమ్ /వార్తలు /సినిమా /

Mahesh Babu-Namrata: ఒలింపిక్స్‌కు రెడీ అంటున్న మహేష్ బాబు పిల్లలు..

Mahesh Babu-Namrata: ఒలింపిక్స్‌కు రెడీ అంటున్న మహేష్ బాబు పిల్లలు..

ఒలింపిక్స్‌కు మహేష్ బాబు పిల్లలు రెడీ (Instagram/Photo)

ఒలింపిక్స్‌కు మహేష్ బాబు పిల్లలు రెడీ (Instagram/Photo)

Mahesh Babu-Namrata | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల సంతానం ఒలింపిక్స్‌కు రెడీ అయ్యారంటూ నమ్రత సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

    Mahesh Babu-Namrata | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల సంతానం ఒలింపిక్స్‌కు రెడీ అయ్యారంటూ నమ్రత సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మహేష్ బాబు భార్య నమ్రత.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. అంతేకాదు తనతో పాటు తన భర్త మహేష్ బాబుతో పాటు కూతురు సితారతో పాటు అబ్బాయి గౌతమ్ కృష్ణకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతేకాదు మహేష్ బాబుకు ఫ్యాన్స్‌కు మధ్య వారిధిలా నిలుస్తోంది. ప్రస్తుతం నమ్రత  పెళ్లి తర్వా.. తన భర్త పిల్లతో కలిసి ఇంట్లోనే ఉంటుంది. అంతేకాదు మహేష్ బాబుకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆమె దగ్గరుండి చూసుకుంటోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన పిల్లలకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది.


    తాజాగా నమ్రత.. తమ పిల్లలు ఇంట్లో ఈత కొడుతున్న వీడియోలను షేర్ చేస్తూ.. మా కిడ్స్.. ఒలింపిక్స్‌ కు రెడీ అంటూ కామెంట్ పెట్టింది. అంతేకాదు తమ పిల్లలను వారికి నచ్చిన పనులను వారు ఇష్టమొచ్చినట్టు చేయమని చెబుతుంటాను. ఎక్స్‌ర్‌సైజ్ పాటు వేరే ఆటలు ఆడుతూ ఉంటే.. మైండ్ కూడా ఫ్రెష్‌గా ఉంటుందని చెప్పుకొచ్చింది నమ్రత. రీసెంట్‌గా నమ్రత.. డ్రగ్స్ కుంభకోణంలో ఈమె పేరు బయటకు రావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు మహేష్ బాబు.. నవంబర్ నుంచి అమెరికాలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు సంబంధించిన షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు తండ్రి ఇద్దరు కొడుకులుగా త్రిపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలో జరిగిన కుంభకోణాల నేపథ్యంలో డైరెక్టర్ పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Gautham Krishna, Mahesh babu, Mahesh Babu Daughter Sitara, Namrata, Tollywood

    ఉత్తమ కథలు