నమ్రత ఘట్టమనేని ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. హీరో మహేష్ బాబు భార్యగా సూపర్‌స్టార్‌కు సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటూ ఉంటుంది. అంతేకాదు నమ్రతను పెళ్లి చేసుకున్న తర్వాతే హీరోగా మహేష్ బాబు కెరీర్ స్పీడ్ అందుకుంది. అంతేకాదు మహేష్ బాబు సినిమా కథల సంగతి ఏమో కానీ... మహేశ్ బాబు సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ సహా పలు వ్యవహారాలను నమ్రత దగ్గరుండి చూసుకుంటారనే టాక్ కూడా ఉంది.ఇక మహేష్ బాబు, నమ్రత వీళ్లిద్దరు బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వంశీ’ సినిమాలో మాత్రమే కలిసి నటించారు. ఆ సినిమాలో వీళ్లిద్దరు కలిసి నటించడం వీరి జీవితాన్నే మార్చివేసిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ కూడా కీలక పాత్రలో నటించడం విశేషం. ఒక రకంగా భర్త, మామలతో కలిసి నమ్రత ఈ సినిమాలో యాక్ట్ చేయడం విశేషం. తాజాగా నమ్రత.. ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో చిట్‌చాట్ చేసింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
తన జీవితంలో బెస్ట్ ఫేజ్ ఇద్దరు బిడ్డలకు తల్లి కావడం అంటూ చెప్పుకొచ్చింది. మరోవైపు తన మావయ్య సూపర్ స్టార్ కృష్ణ ఎంతో కూల్. ఆయన తనకు తండ్రి కన్నా బాగా చూసుకుంటారని చెప్పుకొచ్చింది. ఇక అత్తమ్మ ఇందిరా గురించి మాట్లాడుతూ.. ఆమె ప్రేమకు చిహ్నం అంటూ ఆమె గొప్పతనాన్ని వివరించింది. ఇక మహేష్ బాబుతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటారా అనే విషయం అసలు అది జరగ్గపోవచ్చని చెప్పి కాస్త డిస్సపాయింట్ చేసింది నమ్రత. సినిమాల విషయంలో మహేష్ బాబుదే ఫైనల్ డిసిషన్. నా ప్రమేయం అసలు ఉండదని చెప్పడం విశేషం. అభిమానులు.. మహేష్ బాబు పుట్టినరోజును ఎలా ప్లాన్ చేస్తున్నారనేదానికి కరోనా నేపథ్యంలో ఎలాంటి ప్లాన్స్ లేవంటూ నమ్రత సమాధానం చెప్పింది. నాకు మహేష్ బాబుకు మధ్య లవ్ న్యూజిలాండ్‌లో మొదలైంది. ‘వంశీ’ షూటింగ్ సమయంలో చివరగా ఆయనతో ప్రేమలో ఉన్న విషయం అపుడే తెలిసింది. కానీ మా ఇద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్ చేసారనేది నాకు కన్ఫ్యూజన్ అంటూ చెప్పడం విశేషం. మొత్తంగా తనకు మహేష్ బాబుకు ప్రేమ వ్యవహారాన్ని అభిమానులతో పంచుకుంది నమ్రత.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahesh babu, Namratha Shirodkar, Telugu Cinema, Tollywood