Home /News /movies /

MAHESH BABU NAMRATA RAM CHARAN UPASANA KONIDELA IN ONE FRAME PHOTO GO VIRAL ON SOCIAL MEDIA TA

ఒకే ఫ్రేములో మహేష్ బాబు, రామ్ చరణ్ ఫ్యామిలీ..

ఒకే ఫ్రేములో రామ్ చరణ్,మహేష్ బాబు ఫ్యామిలీ (Twitter/Photo)

ఒకే ఫ్రేములో రామ్ చరణ్,మహేష్ బాబు ఫ్యామిలీ (Twitter/Photo)

అవును ఒకే ఫ్రేములో సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  దంపతులు కనిపించి అభిమానులకు కనువిందు చేశారు. ఈ ఫోటో న్యూ ఇయర్‌కు ముందు దిగింది. ఈ ఫోటోను సూపర్ స్టార్, మెగాభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

    అవును ఒకే ఫ్రేములో సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  దంపతులు కనిపించి అభిమానులకు కనువిందు చేశారు. ఈ ఫోటో న్యూ ఇయర్‌కు ముందు దిగింది. ఈ ఫోటోను సూపర్ స్టార్, మెగాభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోను వీళ్లు ఎయిర్ పోర్ట్‌లో దిగినట్టు ఉంది. ఇక రెండు ఫ్యామిలీల విషయానికొస్తే.. మహేష్ బాబు భార్య నమ్రతకు, రామ్ చరణ్ వైఫ్ ఉపాసన మంచి మిత్రులు. వీళ్లిద్దరి భర్తల మధ్య వృత్తిగతంగా పోటీ ఉన్నా.. వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేవు. ఇక మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు రామ్ చరణ్..తండ్రి మెగాస్టార్ చిరంజీవి హాజరైన సంగతి తెలిసిందే కదా. ఈ వేడుకలో చిరంజీవి, విజయశాంతి గురించి మాట్లాడిన మాటలు హైలెట్‌గా నిలిచాయి. ఇక సరిలేరు నీకెవ్వరు విషయానికొస్తే.. సంక్రాంతి కానుకగా విడుదలైన సంచలన విజయం సాధించింది. అంతేకాదు ఈ చిత్రం ముఖ్యంగా బీ,సీ సెంటర్స్‌లో తెగ ఆడేస్తోంది. విడుదలై మూడు వారాలైన ఇప్పటికీ కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమా సక్సెస్ సాధించడంతో మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి అమెరికా ప్రయాణమయ్యాడు. అక్కడ తన మోకాలికి సంబంధించి శస్త్ర చికిత్స చేయించుకోనున్నట్టు సమాచారం. అక్కడ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వంశీ పైడిపల్లి చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. బహుశా మే నెలలో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

    mahesh babu ram charan
    మహేష్ బాబు, రామ్ చరణ్ (File/Photos


    రామ్ చరణ్ విషయానికొస్తే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఇక బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ ముగ్గురు హీరోలతో పాటు దర్శకుడు రాజమౌళితో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకులు ఈ సినిమా విడుదల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలివియా మోరీస్, శ్రియ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో జరుగుతోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Mahesh babu, Namrata, Ram Charan, RRR, Sarileru Neekevvaru, Upasana kamineni

    తదుపరి వార్తలు