Home /News /movies /

MAHESH BABU NAMRATA MEET BILL GATES IN NEW YORK SB

Mahesh Babu: బిల్‌గేట్స్‌తో మహేష్ బాబు, నమత్ర భేటీ.. వైరల్ అవుతున్న ఫోటో..!

బిల్ గేట్స్‌తో మహేష్ బాబు

బిల్ గేట్స్‌తో మహేష్ బాబు

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు అమెరికా ప‌ర్య‌ట‌న‌లో న్యూయార్క్‌లో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను  కలిశాడు, మ‌హేష్‌బాబు, ఆయ‌న స‌తీమ‌ణి న‌మ్ర‌త శిరోద్క‌ర్ బిల్ గేట్స్‌తో భేటీ అయ్యారు.

    మ‌హేష్‌బాబు ప్ర‌స్తుతం విదేశాల్లో బిజీ బిజీగా ఉన్నాడు. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్  ‘స‌ర్కారువారి పాట’ స‌క్సెస్‌ తర్వాత ఫారిన్ టూర్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరూ తర్వాత  దాదాపు రెండున్న‌రేళ్ళ త‌ర్వాత మ‌హేష్ వెండితెర‌పై క‌నిపించ‌డంతో అభిమానులు కూడా ఎంతో సంతోషంతో ఊగిపోతున్నారు.  అయితే గ‌త కొన్నిరోజుల‌గా మహేష్ ఫ్యామిలీతో క‌లిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోల‌ను అభిమానుల‌తో పంచుకుంటున్నాడు.

    తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు అమెరికా ప‌ర్య‌ట‌న‌లో న్యూయార్క్‌లో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను  కలిశాడు, మ‌హేష్‌బాబు, ఆయ‌న స‌తీమ‌ణి న‌మ్ర‌త శిరోద్క‌ర్ బిల్ గేట్స్‌తో భేటీ అయ్యారు.  బిల్ గేట్స్‌తో ఉన్న ఫోటోను మహేష్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేశారు.  మ‌హేష్‌బాబు ఈ ఫోటోను షేర్ చేస్తూ ‘బిల్‌గేట్స్‌ను క‌ల‌వ‌డం ఆనంద‌గా ఉంది. ప్ర‌పంచంలోని గొప్ప విజ‌న‌రీస్‌లో ఒక‌రు. అంత‌కంటే ఎక్కువ‌ విన‌యంతో ఉన్నాడు. నిజంగా మీరు ఒక స్పూర్తి’ అంటూ ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించాడు. దీంతో ఇప్పుడు ఈ ఫోటో మరింత వైరల్ అవుతుంది. మహేష్ ఫ్యాన్స్ దీనిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు.



    మహేష్ బాబు రేంజ్ ఇది అని కొందరు కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు మహేష్ అన్న గ్రేట్ అంటూ.. పోస్టులు పెడుతున్నారు. మరో నెటిజన్ SSMB29 సినిమా ప్రొడ్యూసర్ అన్నా అంటూ.. ప్రశ్నిస్తున్నారు. ఇలా రకరకాలుగా మహేష్ ఫోటోపై కామెంట్స్ చేస్తున్నారు.   ఇక‌ మ‌హేష్ బాబు మరో రెండు రోజుల్లో ఇండియా రానున్నాడు.




    రాగానే త్రివిక్ర‌మ్ సినిమా ఫైన‌ల్ స్క్రిప్ట్‌ను విన‌నున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం జూలైలో షూటింగ్ ప్రారంభించనుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ ఈ చిత్రానికి ఎస్ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. సర్కారు వారి పాట సినిమా మ‌హేష్ కెరీర్‌లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా స‌ర్కారు వారి పాట నిలిచింది. ఇటీవ‌లే ప్రైమ్‌లో స్రీమింగ్ అవుతున్న విష‌యం తెలిసిందే.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Bill Gates, Mahesh Babu, Namrata Shirodkar

    తదుపరి వార్తలు