Mahesh Babu: మంచు విష్ణు భార్య విరానికా బర్త్ డే పార్టీలో మహేష్ బాబు నమ్రతతో పాటు గోపిచంద్ సందడి..

విరానిక బర్త్ డే పార్టీలో సందడి చేసిన మహేష్ బాబు.నమ్రత, గోపిచంద్ (Twitter/Photo)

Manchu Family - Mahesh Babu | మంచు విష్ణు భార్య విరానికా బర్త్ డే పార్టీలో మహేష్ బాబు నమ్రతతో పాటు గోపిచంద్ సందడి చేసారు.

 • Share this:
  Mahesh Babu - Manchu Family | తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రజలు సంక్రాంతి పండగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. అయితే.. మంచు మోహన్ బాబు కుటుంబంలో మాత్రం కనుమ పండగ రోజున మంచు విష్ణు భార్య మంచు విరానిక పుట్టినరోజు కావడం విశేషం. ఈ సందర్భంగా మంచు విష్ణు ఇంట్లో ఘనంగా పార్టీ ఏర్పాటు చేసారు. ఈ పార్టీకి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు హాజరయ్యారు. ఈ పార్టీకి మహేష్ బాబు తన భార్య నమ్రతతో పాటు హీరో గోపిచంద్ తదితరులు అటెండ్ అయ్యారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు విరానికకు సోషల్ మీడియాలో అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.

  మంచు విష్ణు, మంచు విరానికాకి నలుగురు పిల్లలు. అప్పుడుప్పుడు సోషల్ మీడియాలో తమ పిల్లల ఫొటోలను పోస్టు చేస్తుంటారు. ఈమె ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెల్లెలు అవుతోంది. రాజశేఖర్ రెడ్డి తమ్మడైన సుధీకర్ రెడ్డి కూతురు విరానిక రెడ్డి.


  మంచు విష్ణు, విరానిక పెళ్లికి ముందు కొన్ని రోజులుగా ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెద్దల ఆశీస్సులతో ఒకింటివారయ్యారు. ప్రస్తుతం మంచు విష్ణు విషయానికొస్తే.. ఈయన ‘మోసగాళ్లు’ సినిమా చేస్తున్నాడు. సమ్మర్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్నాన్ని మంచు విష్ణు ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. మరోవైపు విష్ణు.. ‘ఢీ’ సినిమాకు సీక్వెల్‌గా శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘ఢీ అంటే ఢీ’ అనే సినిమా చేయబోతున్నాడు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: