Home /News /movies /

MAHESH BABU MOVIE SARKARU VAARI PAATA NON RENTAL DATE FIX SB

Sarkaru Vaari Paata: అమెజాన్ ప్రైమ్‌లో సర్కారు వారి పాట.. నాన్ రెంట్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

Photo Twitter

Photo Twitter

సర్కారు వారి పాట సినిమా అమెజాన్‌లో పే-పర్‌-వ్యూ పద్దతిలో సర్కారు వారి పాటను స్ట్రీమింగ్‌ చేస్తోంది. కానీ ఇప్పుడు ఈ సినిమా నాన్ రెంటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది.

    టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు(Mahesh Babu), కీర్తి సురేశ్‌ (Keerthi Suresh) జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) ’. మే 12న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలైంది. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. సర్కారు వారి పాట సినిమా ​విడుదలైన మూడు వారాలకే ఇప్పుడు అమెజాన్‌లో వచ్చేస్తుంది. దాదాపు రూ. 200 కోట్లకుపైగా వసూళ్లు చేసిన ఈ మూవీ ఓటీటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు అమెజాన్‌ షాకిచ్చింది. అయితే ఈ మూవీని చూడాలంటే మాత్రం కండీషన్‌ అప్లై చేసింది అమేజాన్. థియేటర్స్ లో ఇప్పటికీ మంచి రన్ కొనసాగిస్తున్న సర్కారు వారి పాట సినిమా రీసెంట్ గానే ప్రముఖ ఓటిటి యాప్ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో స్ట్రీమింగ్ కి వచ్చింది. కాకపోతే రెంటల్ గా పే చేసి చూసే వెసులుబాటుతో తెచ్చారు.

    పే-పర్‌-వ్యూ పద్దతిలో సర్కారు వారి పాటను స్ట్రీమింగ్‌ చేస్తోంది అమెజాన్‌. ‘సర్కారి వారి పాట’ చూడాలంటే సబ్‌స్క్రైబర్లు మూవీ రెంటల్స్‌లో రూ. 199 చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే ఓటీటీలో విడుదలైన కేజీయఫ్‌ 2ను ఇదే విధానంలో అందుబాటులో తెచ్చిన ఆమెజాన్‌ ఇప్పుడు సర్కారు వారి పాట విషయంలోనూ ఇదే స్ట్రాటజీని అమలు చేసింది. అయితే మరి నాన్ రెంటల్ గా ఎప్పుడు నుంచి స్ట్రీమింగ్ కి తీసుకొస్తారో అనేది కన్ఫర్మ్ అయ్యింది. ఈ చిత్రాన్ని ప్రైమ్ వీడియో వారు ఈ జూన్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్ నాన్ రెంటల్ గా తీసుకురాబోతున్నారట.

    ఒకవేళ ఎర్లీగా వద్దు అనుకుంటే అప్పటి వరకు వీక్షకులు ఆగాల్సి ఉంటుంది. లేకపోతే రెంటల్ గా చూడొచ్చు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ సాలిడ్ మాస్ అండ్ సోషల్ డ్రామా మహేష్ కెరీర్ లో మరి మంచి హిట్ గా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా సర్కారు వారి పాట సినిమాను నిర్మించారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Amazon prime, Mahesh Babu, Sarkaru Vaari Paata

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు