హోమ్ /వార్తలు /సినిమా /

Mahesh Babu Mother: తల్లికి తలకొరివి పెట్టిన మహేష్ బాబు.. ఇందిరా దేవి అంత్యక్రియలు పూర్తి..!

Mahesh Babu Mother: తల్లికి తలకొరివి పెట్టిన మహేష్ బాబు.. ఇందిరా దేవి అంత్యక్రియలు పూర్తి..!

మహేష్ బాబు తల్లి అంత్యక్రియలు పూర్తి

మహేష్ బాబు తల్లి అంత్యక్రియలు పూర్తి

కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఇందిరా దేవి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతించలేదు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  టాలీవుడ్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి ఇవాళ మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో మహేష్ కుటుంబం తీవ్ర శోకసంద్రంలో నిలిచిపోయింది. మహేష్ తల్లి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో మహేష్ కుటంబానికి ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. పలువురు మహేష్ తల్లికి ఘన నివాళులర్పించారు.

  మధ్యాహ్నమే మహేష్ తల్లి అంత్యక్రియలు పూర్తి చేశారు కుటుంబ సభ్యులు. మహేష్ తల్లి ఇందిరా దేవి గారికి మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. తల్లికి మహేష్ బాబునే తలకొరివి పెట్టారు. పెద్ద కొడుకు రమేష్ బాబు కూడా ఈ ఏడాది చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో చిన్నకొడుకు అయిన మహేష్ నే తల్లికి సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.

  ఇందిరా దేవి అంత్యక్రియల్లో ఘట్టమనేని కృష్ణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కృష్ణ – ఇందిరా దేవి గారికి మొత్తం ఐదుగురు సంతానం. రమేష్ బాబు, మహేష్ బాబు తో పాటుగా, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని లు ఉన్నారు. ఇందిరా దేవి మృతి తో మహేష్ బాబు కుటుంబం లో తీవ్ర విషాదం నెలకొంది. అయితే ఈ కార్యక్రమానికి మీడియాకు అనుమతి లేదని మహేష్ కుటుంబం పేర్కొంది. మీడియా వారు సహకరించాలని కోరింది.

  తల్లి మరణంతో మహేష్ బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మహేష్ కూతురు సితార కూడా కన్నీరుమున్నీరుగా విలపించింది. నాయననమ్మను చూసి కంటతడి పెట్టింది.దీంతో సితారను తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఓదార్చారు మహేష్ బాబు. ఏడవొద్దని సర్ది చెప్పారు. ఇక మహేష్ కుటుంబానికి పలు రాజకీయ, సినీ ప్రముఖులు కలిసి సంతాపం వ్యక్తం చేశారు. పలువురు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం తెలిపారు.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Mahesh Babu

  ఉత్తమ కథలు