మహేష్ బాబు మండే ట్వీట్స్.. ‘సరిలేరు నీకెవ్వరు’ అంటున్న ఫ్యాన్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో మహేష్ బాబు.. ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా మహేష్ బాబు..

news18-telugu
Updated: November 29, 2019, 3:37 PM IST
మహేష్ బాబు మండే ట్వీట్స్.. ‘సరిలేరు నీకెవ్వరు’ అంటున్న ఫ్యాన్స్..
‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ బాబు (Twitter/Photo)
  • Share this:
సూపర్ స్టార్ మహేష్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో మహేష్ బాబు.. ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ఫస్ట్ టైమ్.. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు  ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయ్ శాంతి ఈ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి ప్రతి మండే ఈ సినిమా విడుదల అయ్యేంత వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ఇవ్వనున్నట్టు ఈ చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటి నుంచి ప్రతి సోమవారం ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో పాటను విడుదల చేయనున్నట్టు ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ ప్రకటించింది.

మొత్తానికి సంక్రాంతి సినిమా ప్రచార రేసులో వెనకబడ్డ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఇక నుండి సోషల్ మీడియా వేదికగా దూకుడు చూపించబోతుందని ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 29, 2019, 3:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading