MAHESH BABU MAHARSHI MOVIE RELEASE IN MAY 9TH CONFIRMED AND FANS AFRAID OF MAY SENTIMENT TA
మే 9న వస్తున్న మహేష్ బాబు ‘మహర్షి.. ఫ్యాన్స్ ను వెంటాడుతున్న ఫ్లాప్ సెంటిమెంట్..
సూపర్ స్టార్ మహేష్‌బాబు (photo: princemahesh.com)
‘మహర్షి’ సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్టు ఇది వరకే ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఈ సినిమాను మే 9న రిలీజ్ చేస్తున్నట్టు ఈ సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్ రాజు ప్రకటించాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ మే నెలలో పోస్ట్ పోన్ అవ్వడంతో మహేష్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు..వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 15 వరకు కంప్లీట్ అవుతుందని ఈ సినిమా నిర్మాతలు ప్రకటించారు. మరోవైపు ‘మహర్షి’ సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్టు ఇది వరకే ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఈ సినిమాను మే 9న రిలీజ్ చేస్తున్నట్టు ఈ సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్ రాజు ప్రకటించాడు. సినిమా షూటింగ్ పూర్తి కావడానికీ..ప్రీ ప్రొడక్షన్‌కు తక్కువ సమయం ఉంటడంతో ఈ సినిమాను రెండు వారాలు ఆలస్యంగా మే 9న విడుదల చేయనున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ మే నెలలో పోస్ట్ పోన్ అవ్వడంతో మహేష్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. గతంలో మహేష్ హీరోగా తేజ దర్శకత్వంలో నటించిన ‘నిజం’ సినిమా మే నెలలో విడుదలైంది.ఈ సినిమాలో నటనకు మహేష్‌కు నంది అవార్డు వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం ‘నిజం’ నిలబడలేక డిజాస్టర్‌గా నిలిచింది.
మహేష్ బాబు, దిల్ రాజు
ఆ తర్వాత మహేష్ బాబు..ఎస్.జే.సూర్య దర్శకత్వంలో నటించిన ‘నాని’ సినిమా కూడా మే నెలలో విడుదలై అట్టర్ ఫ్లాపైంది. ఆ తర్వాత మహేష్ హీరోగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా కూడా మే మంత్ లోనే రిలీజై సూపర్ స్టార్ కెరీర్లోనే అత్యంత చెత్త సినిమా పేరు తెచ్చుకుంది. తాజాగా ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన ‘మహర్షి’ సినిమాను ఇపుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమని చెప్పి మే 9 రిలీజ్ చేస్తున్నారు.
మహర్షి మూవీ పోస్టర్
ఇప్పటి వరకు మహేష్ బాబు నటించగా మే నెలలో విడుదలైన సినిమాలేవి హిట్ కాలేకపోయాయి. ఇపుడు అదే సెంటిమెంట్ వర్కౌటై ఈ సినిమా ఎక్కడ డిజాస్టర్ అవుతుందో అని మహేష్ ఫ్యాన్స్ ఒకటే కంగారు పడిపోతున్నారు. మరి సెంటిమెంట్స్‌ను పక్కనపెట్టి ‘మహర్షి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మెరుపులు మెరిపించి సెంటిమెంట్ అనేది ఏది లేదని ప్రూవ్ చేస్తుందా.. లేకపోతే మే సెంటిమెంట్ వర్కౌటౌ అట్టర్ ఫ్లాప్‌గా నిలుస్తుందా అనేది చూడాలి. ఇక ఈ సినిమాకు వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వినీదత్ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘మహానటి’ సినిమాలు మే 9న విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఒక రకంగా ఆయన బ్యానర్‌కు వర్కౌటైన సెంటిమెంట్ మహేష్ ‘మహర్షి’ సినిమాకు కూడా వర్కౌట్ అవుతుందని మరికొంత మంది భావిస్తున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.