బ్రహ్మోత్సవం కంటే తక్కువ వసూళ్లను రాబట్టిన మహర్షి..

మహేష్‌ బాబుకు 25వ సినిమా కావడంతో.. ఇటు దర్శకుడు వంశీ, అటూ నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మహేష్ బాబు అభిమానులకు, సాధారణ ప్రేక్షకులకు కావాల్సిన హంగుల్నీ..అర్బాటాల్నీ, ఇతర కమర్షియల్ మసాలాను మిస్సవకుండ జాగ్రత్త పడ్డారు.

news18-telugu
Updated: May 10, 2019, 12:19 PM IST
బ్రహ్మోత్సవం కంటే తక్కువ వసూళ్లను రాబట్టిన మహర్షి..
మహర్షి సినిమా పోస్టర్ Photo ; Twitter
news18-telugu
Updated: May 10, 2019, 12:19 PM IST
సూపర్ స్టార్.. మహేష్ బాబు నటించిన చిత్రం 'మహర్షి' బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. స్టైలీష్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను.. దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌తో పాటు వైజయంతి మూవీస్‌, పీవీపీ సినిమా సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించాయి. భారీ తారాగణంతో తెరకెక్కించారు. ఈ సినిమా మహేష్‌ బాబుకు 25వ సినిమా కావడంతో.. ఇటు దర్శకుడు వంశీ, అటూ నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మహేష్ బాబు అభిమానులకు, సాధారణ ప్రేక్షకులకు కావాల్సిన హంగుల్నీ..అర్బాటాల్నీ, ఇతర కమర్షియల్ మసాలాను మిస్సవకుండ జాగ్రత్త పడ్డారు. దీనికి తోడు మ‌హేష్ బాబు తనకున్న పాత్ర పరిధి మేరకు బాగానే న‌టించాడు. రిషి కుమార్ పాత్రలో ఒదిగిపోయాడు. సినిమాలో మరోపాత్ర.. అల్లరి నరేష్ కూడా రవి పాత్రకు ప్రాణం పోశాడు. ఎమోష‌న‌ల్ సన్నివేశాల్లో చాలా బాగా న‌టించాడు. హీరోయిన్ పూజాహెగ్డే పాటల్లో..అప్పుడప్పుడు కొన్ని సన్నివేశాల్లో కన్పిస్తూ..తనకు ఇచ్చిన పాత్రను భాగానే పోషించింది. ఇంకా ఇతర పాత్రల్లో రావు రమేష్, జ‌య‌సుధ‌, ప్రకాశ్ రాజ్, సాయి కుమార్‌లు కూడా పాత్రల పరిధి మేరకు అలరించారు. గురువారం విడుదలైన ఈ సినిమా కలెక్షన్లను పరిశీలిస్తే.. తొలి రోజు దాదాపు రూ.45 కోట్లు సాధించినట్లు తెలుస్తోంది.

Maharshi movie piracy print in Online.. Huge shock to Producers and team of Vamshi Paidipally pk.. ఓ వైపు బ‌య‌ట ప్రేక్ష‌కులు టికెట్ల కోసం తంటాలు ప‌డుతుంటే.. ఆన్ లైన్‌లో మాత్రం అప్పుడే పైర‌సీ లింక్ పెట్టేసి ద‌ర్శ‌క నిర్మాత‌ల పొట్ట కొడుతున్నారు కొన్ని సైట్లు. అయినా ఈ రోజుల్లో సినిమా విడుద‌లైన త‌ర్వాత పైర‌సీ ఆప‌డం ఎవ‌రి వ‌ల్లా కావ‌డం లేదు. maharshi movie piracy,maharshi movie tamilrockers,piracy tamilrockers,maharshi movie online,maharshi movie review,mahesh babu maharshi movie review,maharshi online watch,tamilmv maharshi movie,todaypk maharshi movie,maharshi movie tamilrockers,maharshi movie piracy,telugu cinema,మహర్షి మూవీ రివ్యూ,మహర్షి రివ్యూ,మహర్షి పైరసీ,మహర్షి ఆన్‌లైన్,మహర్షి సినిమా రివ్యూ
మహర్షి సినిమా పోస్టర్ Photo ; Twitter


అయితే 'మహర్షి' సినిమా అనుకున్నంతగా.. ఓవర్సీస్‌లో ఆకట్టుకోవట్లేదని సమాచారం. ముఖ్యంగా యుఎస్‌లో ఈ సినిమాకు ప్రిమియర్ షోల ద్వారా వచ్చిన వసూళ్లు షాక్‌కు గురిచేస్తున్నాయి. మహేష్ చివరి సినిమా 'భరత్ అనే నేను' ప్రిమియర్స్ ద్వారా అక్కడ 8 లక్షల డాలర్లు వసూలు చేయగా.. అంతకుముందు వచ్చిన ఆయన సినిమా 'స్పైడర్' తెలుగు, తమిళ వెర్షన్లు కలిపి మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. కానీ 'మహర్షి' సినిమా ప్రిమియర్స్ ద్వారా కేవలం హాఫ్ మిలియన్ మార్కుతో సరిపెట్టుకుంది. అయితే.. ఈ కలెక్షన్స్.. వేరే హీరో సినిమాకైతే..  చాలా గొప్ప వసూళ్లేనే చెప్పవచ్చు. కానీ సూపర్ స్టార్.. మహేష్ రేంజ్‌కు, సినిమాపై ఉన్న అంచనాలకు..సినిమాకు జరిగిన బిజినెస్ స్థాయికి ఇవి తక్కువ కలెక్షన్స్ అనే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. రూ.13 కోట్లు పెట్టి హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్స్‌కు.. ఈ వసూళ్లు కొంత ఆందోళన కలిగించేవే. మహేష్ కెరీర్‌లోనే అతి పెద్ద డిజాస్టర్స్‌లలో ఒకటిగా చెప్పే.. 'బ్రహ్మోత్సవం' కూడా ప్రిమియర్స్ ద్వారా 5.6 లక్షల డాలర్లు వసూలు చేయగా.. 'మహర్షి' సినిమా కేవలం 5.09 లక్షల డాలర్ల దగ్గర ఆగిపోవడం సినిమాను కొన్న సంస్థలకు అంతుబట్టట్లేదు. అయితే.. లాంగ్ రన్‌లో సినిమాకు వసూళ్లు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు సినీ పండితులు.

First published: May 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...