Home /News /movies /

MAHESH BABU LATEST BLOCKBUSTER SARILERU NEEKEVVARU TO SATELLITE IN GEMINI FOR UGADI PK

బుల్లితెరపై సరిలేరు నీకెవ్వరు.. ఉగాదికి మహేష్ బాబు సందడి..

సరిలేరు నీకెవ్వరు 50 డేస్ కలెక్షన్స్ (sarileru neekevvaru 50 days)

సరిలేరు నీకెవ్వరు 50 డేస్ కలెక్షన్స్ (sarileru neekevvaru 50 days)

Sarileru Neekevvaru: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే సత్తా చూపించింది. ఈ చిత్రం విడుదలై అప్పుడే రెండు నెలలు దాటిపోయింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే సత్తా చూపించింది. ఈ చిత్రం విడుదలై అప్పుడే రెండు నెలలు దాటిపోయింది. ఫుల్ రన్‌లో ఈ చిత్రం 139 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇప్పటి వరకు మహేష్ నటించిన సినిమాల గత రికార్డులను పూర్తిగా తుడిచిపెట్టేసింది ఈ చిత్రం. అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు 50 రోజుల్లో దాదాపు 139 కోట్ల షేర్ వసూలు చేసింది. విడుదలైన మూడు, నాలుగు వారాల్లో ఈ సినిమా అక్కడక్కడా సత్తా చూపించింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం 119 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ప్రకటించింది చిత్ర యూనిట్.

సరిలేరు నీకెవ్వరు 50 డేస్ కలెక్షన్స్ (sarileru neekevvaru 50 days)
సరిలేరు నీకెవ్వరు 50 డేస్ కలెక్షన్స్ (sarileru neekevvaru 50 days)


సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం మాస్ ఆడియన్స్‌ను బాగానే ఆకట్టుకుంటుంది. గ్రాస్ విషయానికి వస్తే 225 కోట్లకు పైగా వసూలు చేసి సత్తా చూపించింది. ఇక ఇప్పటి వరకు థియేటర్స్, అమెజాన్ ప్రైమ్‌లో సత్తా చూపించిన సరిలేరు నీకెవ్వరు ఇప్పుడు బుల్లితెరపైకి వచ్చేస్తుంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను భారీ రేట్ పెట్టి సొంతం చేసుకుంది జెమిని ఛానెల్. ఉగాదికి ఈ సినిమాను తొలిసారి శాటిలైట్ చేస్తున్నారు. రేటింగ్స్ కూడా భారీగానే వస్తాయని ఊహిస్తున్నారు.

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ (Sarileru Neekvvaru Collections)
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ (Sarileru Neekvvaru Collections)


ఎలాగూ బయటికి వెళ్లేది లేదు.. ఇంట్లోనూ ఉండాలి.. కరోనా వైరస్ దెబ్బ గట్టిగానే ఉంది. అందుకే టీవీలో మంచి సినిమాలు వస్తే కచ్చితంగా రేటింగ్స్ కూడా బాగానే వచ్చేలా కనిపిస్తున్నాయి. పైగా సరిలేరు నీకెవ్వరు పూర్తిగా ఎంటర్‌టైనర్. పండక్కి అంతకంటే కావాల్సింది ఇంకేముంది..? అందుకే జెమిని ఛానెల్ కూడా దీనికి భారీ టీఆర్ప్ రేటింగ్స్ వస్తాయని అంచనాలు వేసుకుంటున్నారు. మార్చ్ 25 సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా ప్రసారం కానుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Mahesh babu, Sarileru Neekevvaru, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు