Home /News /movies /

MAHESH BABU KEERTHY SURESH SARKARU VAARI PAATA TWITTER REVIEW SR

Sarkaru Vaari Paata Twitter Review : సర్కారు వారి పాట ట్విట్టర్ రివ్యూ... సినిమా ఎలా ఉందంటే..

Sarkari vaari paata Photo : Twitter

Sarkari vaari paata Photo : Twitter

Mahesh Babu | Sarkaru Vaari Paata Twitter Review : మహేష్ బాబు (Mahesh Babu) నటించిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. (Sarkaru Vaari Paata). భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. యువ దర్శకుడు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహించగా.. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా చేశారు. థమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇక అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అమెరికా లాంటీ ప్రదేశాల్లో ప్రీమియర్స్ పడ్డాయి. దీంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అవేంటో చూద్దాం..

ఇంకా చదవండి ...
  Mahesh Babu | Sarkaru Vaari Paata Twitter Review :  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత భారీ అంచనాల నడుమ మే 12న అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. యువ దర్శకుడు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహించగా.. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా చేశారు. థమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇక అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అమెరికా లాంటీ ప్రదేశాల్లో ప్రీమియర్స్ పడ్డాయి. దీంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు అప్పుడే తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అసలు కథేంటీ, కథనం ఎలా ఉంది.. సినిమా తెలుగు వారిని ఏమాత్రం ఆకట్టుకోలదు.. మహేష్‌‌కు మరో బ్లాక్ బస్టర్ పడ్డట్లేనా.. మొదలగు విషయాలను ట్విట్టర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూద్దాం.. ప్రచారంలో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్‌‌ను విడుదలవ్వగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చివరగా విడుదలైన మాస్ సాంగ్, మ..మ.. మహేశాకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. మాస్ స్టెప్స్‌తో తెగ వైరల్ అవుతోంది. కలర్ ఫుల్ కాస్టూమ్స్‌తో అదరగొట్టే స్టెప్స్‌తో వావ్ అనిపించారు మహేష్ బాబు, కీర్తి సురేష్.

  సర్కారు వారి పాట రన్ టైమ్ 160 నిమిషాలు అంటే దాదాపుగా 2 గంటల 40 నిమిషాలుగా ఉండనుంది. అంతేకాదు ఈ సినిమాకు సెన్సార్ U/A సర్టిఫికేట్ వచ్చింది. ఇక ఈ సినిమా ప్రిరిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా మొత్తంగా 120 కోట్లకు జరిగిందని తెలుస్తోంది. నైజాంలో 36 కోట్లకు అమ్ముడైందని తెలుస్తోంది. సీడెడ్ 13 కోట్లకు, ఉత్తరాంధ్ర 12. 50 కోట్లకు.. ఈ స్ట్ 8.50 కోట్లకు, వెస్ట్ 7 కోట్లకు, గుంటూరు 9 కోట్లకు, కృష్ణ 7.50 కోట్లకు, నెల్లూరు 4 కోట్లకు ఇక ఏపీ తెలంగాణ మొత్తంగా 96. 50 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక కర్నాటక 8.50 కోట్లకు, రెస్ట్ ఆఫ్ ఇండియా 3 కోట్లకు, ఓవర్సీస్ 11 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. మొత్తంగా 120 కోట్లకు అమ్ముడు పోయిందని అంటున్నారు. దీంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే 121 కోట్లు రావాల్సి ఉంది.  ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి కళావతి (Kalaavathi song) అనే సాంగ్‌‌ను విడుదల చేసింది టీమ్. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడారు.  థమన్ (Thaman) సంగీతం అందించారు. పాటలో విజువల్స్ బాగున్నాయి. ఈ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటి వరకు 100 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ సాధించి కేక పెట్టిస్తోంది. ఇక రెండవ సింగిల్‌గా వచ్చిన పెన్నీ సాంగ్ (Penny Music Video) కూడా మంచి ఆదరణ పొందుతోంది. ఈ పాట సూపర్ స్టైలీష్‌గా ఉంటూ.. ఇన్‌స్టాంట్ హిట్‌గా నిలిచింది. ఆ పాటలో మహేష్ కూతురు సితార ఘట్టమనేని చేసిన స్టైలిష్ పెర్ఫామెన్స్ మరో హైలైట్‌గా ఉంది. నాకాష్ ఆజీజ్ పాడగా... అనంత శ్రీరామ్ రాశారు. ఈ (Sarkaru Vaari Paata)  సినిమా మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. మహేష్ బాబు గత చిత్రాలు ‘నాని’, ’నిజం’, బ్రహ్మోత్సవం’, ’స్పైడర్’ మే నెలలో విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే ’మహర్షి’ సినిమా మినహాయింపు అనే చెప్పాలి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.

  ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటిస్తున్నారు. ఈ సినిమా (Sarkaru Vaari Paata) కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం చుట్టూ కేంద్రీకృతమైందని తెలుస్తోంది. సినిమాలో హీరో ఫాదర్‌ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది.ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోందట. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడిన ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఇక ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్‌ (S.SThaman) సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్‌ కె వెంకటేష్ ఎడిటింగ్‌ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్, రాజమౌళిల సినిమాల్లో నటించనున్నారు.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Keerthy Suresh, Mahesh Babu, Sarkaru Vaari Paata, Tollywood news

  తదుపరి వార్తలు