• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • MAHESH BABU KEERTHY SURESH SARKARU VAARI PAATA SHOOT STARTS TODAY IN DUBAI SR

Mahesh Babu : ఎట్టకేలకు దుబాయ్‌లో మొదలైన సర్కారు వారి పాట షూటింగ్..

Mahesh Babu : ఎట్టకేలకు దుబాయ్‌లో మొదలైన సర్కారు వారి పాట షూటింగ్..

మహేష్ బాబు, కీర్తి సురేష్ Photo : Twitter

Mahesh Babu | Sarkaru Vaari Paata ఎట్టకేలకు మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ ఈరోజు దుబాయ్‌లో మొదలైంది.

  • Share this:
    మహేష్ సరిలేరు నీకెవ్వరు లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత సర్కారు వారి పాట సినిమాకు సై అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పరుశురామ్ దర్శకత్వం వహించనున్నాడు. కరోనా కారణంగా సినిమా షూటింగ్స్‌కు దూరంగా ఉంటూ, కుటుంబ సభ్యులతోనే గడిపిన మహేష్.. ఈరోజు షూటింగ్‌లో పాల్గోన్నాడు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా షూటింగ్ ఈరోజు దుబాయ్‌లో స్టార్ట్ అయ్యింది. అయితే వాస్తవానికి తొలి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోనే చేయాలని మొదట అనుకొన్నా, ప్లానింగ్‌లో మార్పు జరిగి, దుబాయ్‌కు వెళ్లింది చిత్రబృందం. ఇక అక్కడే దాదాపు 20 రోజుల పాటు అక్కడ షూటింగ్‌ జరుపుకోనుంది చిత్రబృందం. దుబాయ్‌లో 20 రోజులు షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత రెండో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరగనుంది. అంతేకాదు హైదరాబాద్‌ షెడ్యూల్‌‌లో భాంగా ఫిల్మి సిటీలో ఓ సాంగ్ ను షూట్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా దీనికి సంబంధించిన సెట్ వర్క్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన ఈ టైటిల్ సాంగ్ సెట్ తీర్చిదిద్దారట. ఈ పాట టైటిల్ సాంగ్ వస్తోందట.

    ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోంది. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమా మూడో షెడ్యూల్‌ అమెరికాలో చేస్తారని సమాచారం అందుతోంది. సమ్మర్‌లో అంటే మార్చి, ఏప్రిల్‌ నెలలో 40 రోజులపాటు అమెరికాలో చిత్రీకరణ చేయనుందట చిత్రబృందం.



    ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో హిందీ వర్సటైల్ యాక్టర్ విద్యా బాలన్ నటించనుందని సమాచారం. విద్యా బాలన్ తెలుగులో బాలయ్య సరసన ‘ఎన్టీఆర్ కథానాయకుడు', 'మహానాయకుడు’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కూడా నటించనున్నాడు. ఇందులో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రానికి మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. మార్తండ్‌ కె వెంకటేశ్‌ ఎడిటింగ్‌ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు