Mahesh Babu | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12 విడుదలకానుంది. దీంతో ప్రచారంలో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదలవ్వగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా మరో మాస్ వస్తోన్నసంగతి తెలిసిందే. మ..మ.. మహేశా, నే ము..ము.. ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. మాస్ స్టెప్స్‌తో తెగ వైరల్ అవుతోంది. కలర్ ఫుల్ కాస్టూమ్స్‌తో అదరగొట్టే స్టెప్స్‌తో వావ్ అనిపించారు మహేష్ బాబు, కీర్తి సురేష్. దీనికి సంబంధించిన పూర్తి పాట రేపు అంటే మే 7న విడుదలకానుంది. ఇక ఈ సినిమా సెన్సార్ పూర్తి అయ్యిందని తెలుస్తోంది. ఈ చిత్రం నిడివి కాస్తా ఎక్కువుగా ఉన్నట్లు తెలుస్తోంది. సర్కారు వారి పాట రన్ టైమ్ 160 నిమిషాలు అంటే దాదాపుగా 2 గంటల 40 నిమిషాలుగా ఉండనుందట. అంతేకాదు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ వచ్చిందని తెలుస్తోంది. అయితే విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
ఇక మరోవైపు ఇప్పటికే మహేష్ డబ్బింగ్ పనులు పూర్తవ్వడంతో ఆయన తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీమ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. మహేష్ దుబాయ్ నుండి రాగానే ఆయన కూడా ప్రమోషన్స్‌లో పాల్గోనున్నారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి కళావతి (Kalaavathi song) అనే సాంగ్‌ను విడుదల చేసింది టీమ్. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడారు. థమన్ (Thaman) సంగీతం అందించారు. పాటలో విజువల్స్ బాగున్నాయి. ఈ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటి వరకు 100 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సాధించి కేక పెట్టిస్తోంది.
#MaMaMahesha 💥 Promo is here ✨💃🧨
Our Very Own #SuperStar @urstrulyMahesh #Massified Stepsssss !! On bigggggg Screen it’s goona be a festival for sure 🔥💃🧨
Wooooohoooooooooooo let’s make the Way for the #MassSongoftheYear
Get ur earphones 🎧 NOW https://t.co/jlMHwfm4mX
— thaman S (@MusicThaman) May 6, 2022
ఇక రెండవ సింగిల్‌గా వచ్చిన పెన్నీ సాంగ్ (Penny Music Video) కూడా మంచి ఆదరణ పొందుతోంది. ఈ పాట సూపర్ స్టైలీష్‌గా ఉంటూ.. ఇన్స్టాంట్ హిట్‌గా నిలిచింది. ఆ పాటలో మహేష్ కూతురు సితార ఘట్టమనేని చేసిన స్టైలిష్ పెర్ఫామెన్స్ మరో హైలైట్‌గా ఉంది. నాకాష్ ఆజీజ్ పాడగా... అనంత శ్రీరామ్ రాశారు. ఈ (Sarkaru Vaari Paata) సినిమా మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. మహేష్ బాబు గత చిత్రాలు ‘నాని’, ’నిజం’, బ్రహ్మోత్సవం’, ’స్పైడర్’ మే నెలలో విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే ’మహర్షి’ సినిమా మినహాయింపు అనే చెప్పాలి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఒకేసారి ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటిస్తున్నారు. ఈ సినిమా (Sarkaru Vaari Paata) కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం చుట్టూ కేంద్రీకృతమైందని తెలుస్తోంది. సినిమాలో హీరో ఫాదర్ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది.ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోందట. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడిన ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఇక ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్ (S.SThaman) సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్, రాజమౌళిల సినిమాల్లో నటించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahesh Babu, Sarkaru Vaari Paata