Home /News /movies /

MAHESH BABU KEERTHY SURESH SARKARU VAARI PAATA KALAAVATHI SONG CROSS 80 MILLION VIEWS IN YOUTUBE TA

Sarkaru Vaari Paata - Mahesh Babu : మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ మరో రికార్డు.. 80 మిలియన్ క్లబ్‌లో కళావతి పాట..

80 మిలియన్ క్లబ్‌లో ’సర్కారు వారి పాట’ కళావతి సాంగ్ (Twitter/Photo)

80 మిలియన్ క్లబ్‌లో ’సర్కారు వారి పాట’ కళావతి సాంగ్ (Twitter/Photo)

Mahesh Babu | Sarkaru Vaari Paata | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా నుంచి విడుదలైన కళావతి సాంగ్ తాజాగా 80 మిలియన్ క్లబ్‌లో చేరింది.

ఇంకా చదవండి ...
    Mahesh Babu | Sarkaru Vaari Paata | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’  (Sarkaru Vaari Paata) సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా.  ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల స్పెయిన్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించిన చిత్రబృందం, తుది షెడ్యూల్‌ను తాజాగా హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. అది అలా ఉంటే ఈ సినిమా నుంచి కళావతి అనే సాంగ్‌‌ను విడుదల చేసింది టీమ్. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడారు.  థమన్ (Thaman) సంగీతం అందించారు. పాటలో విజువల్స్ బాగున్నాయి. ఈ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

    అంతేకాదు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటి వరకు 80  మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ సాధించి కేక పెట్టిస్తోంది. తక్కువ వ్యవధిలో తెలుగులో ఈ పాట ఈ రికార్డు క్రియేట్ చేసింది.


    ఇక ఈ సినిమా మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.మహేష్ బాబు గత చిత్రాలు ‘నాని’, ’నిజం’, బ్రహ్మోత్సవం’, ’స్పైడర్’ మే నెలలో విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే ’మహర్షి’ సినిమా మినహాయింపు అనే చెప్పాలి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) షూటింగ్ విషయానికి వస్తే.. దుబాయ్ లో తొలి షెడ్యూల్ షూటింగును పూర్తి చేసిన సర్కారు వారి పాట టీమ్, ఆ తరువాత గోవాలో ఓ షెడ్యూల్ ను కూడా పూర్తిచేసింది. ఈ సందర్భంగా రెండో పాటకు సంబంధించిన ప్రిపరేషన్స్ మొదలైయ్యాయి.

    Radhe Shyam : 2022లో ప్రభాస్ ’రాధే శ్యామ్’ మరో రికార్డు.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రెబల్ స్టార్ దూకుడు..

    ఇక ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఒకేసారి ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్, సినిమా చేయనున్నారు. ఆ తర్వాత రాజమౌళి సినిమా ఉండనే ఉంది. ఈ రకంగా ‘సర్కారు వారి పాట’ సినిమాతో తొలిసారి ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తే.. రాబోయే సినిమాలకు హెల్ప్ అవుతుందని మేకర్స్ ఆలోచిస్తున్నారట.

    Radhe Shyam US Premiers : ’రాధే శ్యామ్’ సహా ఓవర్సీస్‌లో US ప్రీమియర్స్ ద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాలు..

    ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటిస్తున్నారు. ఈ సినిమా (Sarkaru Vaari Paata) కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం చుట్టూ కేంద్రీకృతమైందని తెలుస్తోంది. సినిమాలో హీరో ఫాదర్‌ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది.ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోందట. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడిన ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఇక ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్‌ (S.SThaman) సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్‌ కె వెంకటేష్ ఎడిటింగ్‌ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్, త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Keerthy Suresh, Mahesh Babu, Sarkaru Vaari Paata, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు