MAHESH BABU KEERTHY SURESH SARKARU VAARI PAATA FIRST SINGLE KALAAVATHI SONG PROMO GETS GOOD RESPONSE SR
Mahesh Babu | Sarkaru Vaari Paata : టాప్‌లో ట్రెండ్ అవుతోన్న సర్కారు వారి పాట ఫస్ట్ సింగిల్ ప్రోమో..
Mahesh Babu | Sarkaru Vaari Paata : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ పేరుతో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి మహేష్ బాబు, కీర్తి సురేష్ రొమాంటిక్ పాటకు సంబంధించిన సాంగ్ ప్రోమోను విడుదల చేశారు.
Mahesh Babu - Sarkaru Vaari Paata - Release Date | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) హీరోగా డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata)పేరుతో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల స్పెయిన్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించిన చిత్రబృందం, తుది షెడ్యూల్‌ను తాజాగా హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా అంతా అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకావాల్సి ఉండేది. కానీ ఈ సారి సంక్రాంతికి రాజమౌళి ఆర్ ఆర్ ఆర్.. మరోవైపు భీమ్లా నాయక్, ప్రభాస్ రాధే శ్యామ్ ఇలా మూడు సినిమాలు వస్తున్నట్టు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ‘సర్కారు వారి పాట’ సినిమా విడుదల వాయిదా పడింది. కానీ ఆయా సినిమాలేని కరోనా థర్డ్ వేవ్ కారణంగా విడదలను పోస్ట్‌పోన్ అయ్యాయి. ఈ సినిమాను జనవరి 13న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు గతంలో అధికారికంగా ప్రకటించిగా.. మధ్యలో దర్శకుడు రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా జనవరి 7న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేయడంతో ఇప్పుడు అంతా తారుమారు అయ్యింది.
సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సమ్మర్ కానుకగా ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంతలోనే చిరంజీవి ఆచార్య ఏప్రిల్ 1న విడుదల తేదిని ప్రకటించారు. తాజాగా ఆర్ఆర్ఆర్ మార్చి 25న వస్తున్నట్టు ప్రకటించడంతో ఆచార్య ఏప్రిల్ 29కు వాయిదా పడింది. ఈ సినిమా విడుదలైన రెండు వారాల తర్వాత మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) సినిమా మే 12న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మహేష్ బాబు గత చిత్రాలు ‘నాని’, ’నిజం’, బ్రహ్మోత్సవం’, ’స్పైడర్’ మే నెలలో విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే ’మహర్షి’ సినిమా మినహాయింపు అనే చెప్పాలి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
ఇపుడు ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) సినిమాను మే నెలలో విడుదల చేస్తున్నారు. ఇక అది అలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి కళావతి నుంచి మొదటి పాటకు సంబంధించిన సాంగ్ ప్రోమోను విడుదల చేసింది టీమ్. ఈ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. దీంతో దీనికి సంబంధించి టీమ్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అంతేకాదు ఈ ప్రోమో ఇప్పటికే ఫైవ్ మిలియన్ పైగా వ్యూస్‌ను సాధించి అదరగొడుతోంది. ఇక దీనికి సంబంధించి ఫుల్ సాంగ్‌ను ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్నట్టు ఓ పోస్టర్ విడుదల చేశారు.
సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) షూటింగ్ విషయానికి వస్తే.. దుబాయ్ లో తొలి షెడ్యూల్ షూటింగును పూర్తి చేసిన సర్కారు వారి పాట టీమ్, ఆ తరువాత గోవాలో ఓ షెడ్యూల్ ను కూడా పూర్తిచేసింది. ఈ రెండు షెడ్యూల్స్ లోను భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో విలన్‌గా సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. సముద్ర ఖని తెలుగుతో పాటు తమిళంలో పలు సినిమాల్లో నటించి అలరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటిస్తున్నారు. ఈ సినిమా (Sarkaru Vaari Paata) కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం చుట్టూ కేంద్రీకృతమైందని తెలుస్తోంది. సినిమాలో హీరో ఫాదర్ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది.
ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోందట. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడిన ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఇక ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్ (S.SThaman) సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్ చేస్తున్నారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.