Home /News /movies /

MAHESH BABU KEERTHY SURESH SARKARU VAARI PAATA 2ND DAY WW COLLECTIONS SR

Sarkaru Vaari Paata 2nd Day WW Collections : సర్కారు వారి పాట సెకండ్ డే వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్..

‘సర్కారు వారి పాట’  (Twitter/Photo)

‘సర్కారు వారి పాట’ (Twitter/Photo)

Mahesh Babu | Sarkaru Vaari Paata Collections : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత భారీ అంచనాల నడుమ మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకోంది.

ఇంకా చదవండి ...
    Mahesh Babu | Sarkaru Vaari Paata Collections : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత భారీ అంచనాల నడుమ మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకోంది. యువ దర్శకుడు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహించగా.. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా చేశారు. థమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.సర్కారు వారి పాట రన్ టైమ్ 160 నిమిషాలు అంటే దాదాపుగా 2 గంటల 40 నిమిషాలుగా ఉండనుంది. అంతేకాదు ఈ సినిమాకు సెన్సార్ U/A సర్టిఫికేట్ వచ్చింది. ఇక ఈ సినిమా ప్రిరిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా మొత్తంగా 120 కోట్లకు జరిగిందని తెలుస్తోంది. నైజాంలో 36 కోట్లకు అమ్ముడైందని తెలుస్తోంది. సీడెడ్ 13 కోట్లకు, ఉత్తరాంధ్ర 12. 50 కోట్లకు.. ఈ స్ట్ 8.50 కోట్లకు, వెస్ట్ 7 కోట్లకు, గుంటూరు 9 కోట్లకు, కృష్ణ 7.50 కోట్లకు, నెల్లూరు 4 కోట్లకు ఇక ఏపీ తెలంగాణ మొత్తంగా 96. 50 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక కర్నాటక 8.50 కోట్లకు, రెస్ట్ ఆఫ్ ఇండియా 3 కోట్లకు, ఓవర్సీస్ 11 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. మొత్తంగా 120 కోట్లకు అమ్ముడు పోయిందని అంటున్నారు. దీంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే 121 కోట్లు రావాల్సి ఉంది.

    ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. మొదట ఈ సినిమా కాస్తా మిక్సుడ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. అయినా కలెక్షన్స్ మాత్రం మొదటి రోజు ఓ రేంజ్’లో అందుకోగా,.. సినిమా రెండో రోజు మాత్రం కాస్తా తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలైంది. హీరోగా 27వ చిత్రం. ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ గ్రాస్ వసూళ్లను సాధించినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. హీరోగా మహేష్ బాబుకు అమెరికాలో 1 మిలియన్ క్రాస్ చేసిన చిత్రాల్లో 11వ ది. యూఎస్‌లో ఎక్కువ 1 మిలియన్ డాలర్స్ వసూళు చేసిన చిత్రాల్లో మహేష్ బాబు చిత్రాలదే అగ్ర స్థానం. దీంతో  చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది.

    వరల్డ్ వైడ్‌గా సర్కారు వారి పాట సాధించిన కలెక్షన్స్..
    Nizam: 17.10Cr
    Ceeded: 5.96Cr
    UA: 5.39Cr
    East: 4.33Cr
    West: 3.19Cr
    Guntur: 6.34Cr
    Krishna: 2.83Cr
    Nellore: 1.91Cr
    AP-TG Total:- 47.05CR(66.30CR~ Gross)
    KA+ROI:- 3.35Cr
    OS: 7.81Cr Updated
    Total WW:- 58.21CR(90CR~ Gross)

    రెండో రోజు సినిమా వరల్డ్ వైడ్‌గా ఈసినిమా 13 కోట్ల రేంజ్‌లో షేర్ ని సొంతం చేసుకుందని అంటున్నారు. ఇక 121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 2 రోజులు పూర్తీ అయ్యే సమయానికి ఇంకా 62.79 కోట్ల రేంజ్‌‌లో షేర్ అందుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి కళావతి (Kalaavathi song) అనే సాంగ్‌‌ను విడుదల చేసింది టీమ్. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడారు.  థమన్ (Thaman) సంగీతం అందించారు. పాటలో విజువల్స్ బాగున్నాయి. ఈ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటి వరకు 100 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ సాధించి కేక పెట్టిస్తోంది. ఇక రెండవ సింగిల్‌గా వచ్చిన పెన్నీ సాంగ్ (Penny Music Video) కూడా మంచి ఆదరణ పొందుతోంది.

    ఈ పాట సూపర్ స్టైలీష్‌గా ఉంటూ.. ఇన్‌స్టాంట్ హిట్‌గా నిలిచింది. ఆ పాటలో మహేష్ కూతురు సితార ఘట్టమనేని చేసిన స్టైలిష్ పెర్ఫామెన్స్ మరో హైలైట్‌గా ఉంది. నాకాష్ ఆజీజ్ పాడగా... అనంత శ్రీరామ్ రాశారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటిస్తున్నారు. ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్‌ (S.SThaman) సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్‌ కె వెంకటేష్ ఎడిటింగ్‌ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్, రాజమౌళిల సినిమాల్లో నటించనున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Mahesh Babu, Sarkaru Vaari Paata, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు