Mahesh Babu: మహేష్ బాబు కళావతి సాంగ్ మరో రికార్డు.. ఏ రేంజ్‌లో వ్యూస్ అంటే..!
Mahesh Babu: మహేష్ బాబు కళావతి సాంగ్ మరో రికార్డు.. ఏ రేంజ్‌లో వ్యూస్ అంటే..!
‘సర్కారు వారి పాట’ (Twitter/Photo)
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమాలోని కళావతి సాంగ్ మరోసారి వార్తల్లో నిలిచింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా సర్కారు వారి పాట. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం మంచి అంచనాల నడుమ మే 12న విడుదలై ఓకే అనిపించుకుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. Sarkaru Vaari Paata Twitter
అనేక వాయిదాల తర్వాత భారీ అంచనాల నడుమ మార్చి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకోంది. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం యావరేజ్‌గా నిలిచింది. ఈ సినిమాకు యువ దర్శకుడు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహించగా.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేశారు. (Twitter/Photo)
మ్యూజికల్ సెన్సేషన్ థమన్ కంపోజ్ చేసిన సర్కారు వారి పాట ఆల్బమ్ ఇప్పటికే మ్యాజిక్ ని క్రియేట్ చేసింది. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ కళావతి పాట మెలోడీ అఫ్ ది ఇయర్ గా నిలిచింది. Sarkaru Vaari paata Twitter
అయితే తాజాగా ఈ సాంగ్ మరో రికార్డు క్రియేట్ చేసింది. ఈ ఏడాది భారీ వ్యూస్ తో పాటు భారీ లైక్స్ ను అందుకున్న సాంగ్ గా కళావతి నిలిచింది. మొత్తం గా 237 మిలియన్ వ్యూస్ ను సాధించగా, 2.5 మిలియన్స్ కి పైగా లైక్స్ ను సొంతం చేసుకొని సెన్సేషన్ క్రియేట్ చేసి మరోసారి హట్ టాపిక్‌గా మారింది.
కళావతి పాట ఇంటర్నెట్ సెన్సేషన్ గా నిలవడమే కాకుండా వివిధ ఆడియో స్ట్రీమింగ్ వేదికలు, యాప్స్ లో టాప్ సాంగ్ లిస్టు లో కొనసాగుతుంది. యుట్యూబ్ లో కూడా ట్రెండింగ్ వీడియోస్ లో చాలా రోజుల పాటు టాప్ ప్లేసులో నిలిచింది.
ఈ పాటలో మహేష్ బాబు క్లాసీ డ్యాన్సులు ఫ్యాన్స్ ని ఫిదా చేశాయి. అనంత శ్రీరామ్ కళావతి పాటకు ఆకట్టుకునే సాహిత్యం అందించారు. ఇక ప్రముఖ సెన్సేషన్ సింగర్ సిద్ శ్రీరామ్ తన వాయిస్ తో కళావతి పాటకు ఊపిరి పోసి.. మరింత మెస్మరైజ్ చేశారు. ( Photo : Twitter)
మరోవైపు ఈ సినిమాలో మ మ.. మహేశా సాంగ్ మరో రికార్డును కైవసం చేసుకుంది. ఈ పాట యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఈ యేడాది మహేష్ బాబు నటించిన ఒక సినిమాలోని రెండు పాటలు వంద మిలియన్ వ్యూస్ రాబట్టడం విశేషం. (Twitter/Photo)
సర్కారు వారి పాట సినిమా 121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. మొత్తంగా థియేట్రికల్ రన్ మగిసింది. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా రూ. 110.12 కోట్లు వసూళ్లు చేసింది. మొత్తంగా బ్రేక్ ఈవెన్‌కు రూ. 10.88 కోట్ల దూరంలో ఆగిపోయింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.